కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు..
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ(NATIONAL MEDICAL COMMISSION) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ఎంసీ (No Fines Imposed) ఒక్క కాలేజీకి కూడా జరిమానా విధించలేదు. 4090 ఎంబీబీఎస్ సీట్లు యథావిథిగా కొనసాగనున్నాయి.. ఫ్యాకల్టీ కొరతను అధిగమిస్తున్నా ఎన్ఎంసీ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు టీచింగ్ ఫ్యాకల్టీకి పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు, అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది..
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోందని ఈగల్ టీం ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం మొదలు పెట్టారని.. హోటల్ యజమానుష్టుల డ్రగ్స్ కేసులో సూర్య కీలక సూత్రధారిగా ఉన్నారన్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతోపాటు ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా వాళ్ల కోసం ఇంకా గాలిస్తున్నామని స్పష్టం చేశారు.
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.
మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. చిత్తూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని.. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అని ప్రశ్నించారు. అయినా ఇక్కడికి…
యెమెన్ జాతీయుడి హత్య కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు వచ్చే వారం జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. గత సంవత్సరం, కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ఆమోదించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆమె కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉరిశిక్ష పడిన ప్రియా క్షమాభిక్షను ఆ దేశ అధ్యక్షుడు…
ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ దాడిని ఎఫ్ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED) తయారు చేయడానికి.. అల్యూమినియం పౌడర్‌ను అమెజాన్…
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..
ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు.