ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..
ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు.
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాగ సాధువులతో కలిసి నటుడు మోహన్ బాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు.ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది.” అని వెల్లడించారు. READ MORE: KP Sharma […]
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చను ప్రారంభించారు. రాముడు, శివుడు, విశ్వామిత్రుడు వంటి దేవతలు నేపాల్ లోనే పుట్టారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాఠ్మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు నేపాల్ లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో దేశ ప్రజలు వెనకడుగు వేయొద్దన్నారు.
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం ప్రారంభించారు. దాడికి కూడా యత్నించారు. పోలీసులు…
కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నట్లు తెలిసింది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ నేతృత్వంలోని టూరిజం డిపార్ట్మెంట్ అమెకు స్పాన్సర్ చేసిందని వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి మహమ్మద్ రియాస్ స్పందించారు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.