చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అజిత్ దోవల్ వివరించారు. భారతదేశం నష్టాన్ని చూపించే ఒక్క చిత్రాన్ని అయినా తనకు చూపించాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పలు విదేశీ మీడియా సంస్థలు పాకిస్థాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయని కథనాలు రాశాయి. ఈ అంశంపై తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు.
యువత మత్తుకు బానిసవుతోంది. లిక్కర్ తర్వాత .. గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముంచేస్తున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. వీటికి అవుననే సమాధానాలు వస్తున్నాయి. సిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గలీజ్ దందాకు పబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఇది హైదరాబాద్‌లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. గంజాయి లాంటి…
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ'. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న 3డీ ఫార్మాట్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది.
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్ కుటుంబమే ఇరిగేషన్ శాఖ చూసిందన్నారు. ఐదేళ్లు…
ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఐడీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు బాడీని అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్హెచ్ హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని ఆరోపిస్తూ.. కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్‌సీఏ. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేసి ఉంటే..…
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది. ఈ ఘటనలో భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఐదు నెలల్లో జాగ్వార్ విమానాలు కూలిపోవడం ఇది మూడో సారి అని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం ఓ పొలంలో కూలింది. పైలట్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఇది వరకు 44 మృతదేహాలు గుర్తించిన విషయం తెలిసిందే. లభించని ఆ 8 మంది విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది ఆచూకీ లభించడం కష్టమేనని నిర్ణయానికి వచ్చారు. రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్‌లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ లభించని ఆ 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.