China: చైనా కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష విధించింది. ఈ కుటుంబం ఒక క్రిమినల్ ముఠాను నడిపింది. హత్య, మోసం, వ్యభిచారం, మనీలాండరింగ్ లాంటి అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడింది. ఈ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. వెన్జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు మయన్మార్‌లోని కోకాంగ్‌లో నివాసం ఉంటున్న మింగ్ గుపింగ్, మింగ్ జెన్జెన్, జౌ వీచాంగ్‌లతో పాటు మరో ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. కోర్టు మరో ఐదుగురికి రెండేళ్ల సస్పెండ్ మరణశిక్షలు విధించగా, మరో 12 మంది నిందితులకు ఐదు నుంచి 24 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది.
READ MORE: Indian Army Chief Warns Pak: పాకిస్తాన్ ను భూగోళంలో లేకుండా చేస్తాం.. ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
వారు చేసిన నేరాల గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ కుటుంబాన్ని అపఖ్యాతి పాలైన మింగ్ కుటుంబం అని పిలుస్తారు. వీళ్లు 1.4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అక్రమ జూదం వ్యాపారాన్ని నడిపారు. అనేక మంది ఉద్యోగులను హత్య చేయడమే కాకుండా వ్యభిచారంలో పాల్గొనేలా చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. చైనా రాష్ట్ర ప్రసార సంస్థ CCTV ప్రకారం.. 2015 నుంచి మింగ్ కుటుంబం తూర్పు చైనా ప్రావిన్స్ జెజియాంగ్‌లో భారీ నేర నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుటుంబ ముఠా మయన్మార్‌లోని కోకాంగ్ ప్రాంతంలో నుంచి అన్ని నేర కార్యకలాపాలను నిర్వహించేవారు. టెలికాం మోసం, అక్రమ క్యాసినో, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వివిధ నేరాలలో చేశారు. ఈ అక్రమ వ్యాపారాల నుంచి దాదాపు 10 బిలియన్ యువాన్లు అంటే రూ. 12 వేల కోట్లకు పైగా సంపాదించారు.
READ MORE: Avatar 3: ‘అవతార్: స్నీక్ పీక్‌తో ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
మింగ్ కుటుంబం చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు.. ఉద్యోగులను విదేశాల నుంచి ఆకర్షించారు. ఇందులో ఎక్కువ మంది చైనా పౌరులు అధికంగా ఉన్నారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు తెలుసుకున్న ఉద్యోగులు ఈ స్థావరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నించారు. మాట వినని వారిని అక్కడే హింసించి చంపేశారు. రెండేళ్ల క్రితం బాధిత కుటుంబీకులు లౌకై ప్రాంతంలోని స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో మింగ్ కుటుంబ పితృస్వామ్యుడు మరణించాడు. తదనంతరం, మింగ్ కుటుంబం చేసిన నేరాలు బయటపడ్డాయి. వారందరినీ చైనా పోలీసులు అరెస్టు చేశారు. కేసు కోర్టు చేరడంతో జెజియాంగ్ కోర్టు ఫిబ్రవరిలో మొదటిసారి కేసును విచారించింది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.