Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. షోయబ్ తన మూడవ భార్య సనా జావేద్ తో విడాకులు తీసుకునేందు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఊహాగానాలు మరింతగా పెంచింది. ఈ వీడియోలో, మాలిక్, అతని ప్రస్తుత భార్య సనా ఇద్దరూ దూరాన్ని పాటిస్తూ.. బహిరంగంగా ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా కనిపించారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేయగా.. సనా ముఖం తిప్పుకుని ఉన్నట్లు చూడవచ్చు. అయితే మాలిక్ లేదా సనా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
జనవరి 2024లో షోయబ్, సనా జావేద్ జంట తమ నికాహ్(వివాహం)ను ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దాదాపు ఏడాదిన్నర కాపురం చేశారు. ఈ దంపతులకు ఇజ్యాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2024 జనవరిలో ఈ జంటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ముచ్చటగా మూడోసారి మూడవ భార్య సనా జావిద్ కు విడాకులు ఇచ్చేందుకు షోయబ్ మాలిక్ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
అయితే.. 2002 ఏడాదిలో ఆయేషాను పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. 2010 సంవత్సరంలో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం 2010 సంవత్సరంలోనే హైదరాబాద్ అమ్మాయి, ఎన్ని స్టార్ సానియా మీర్జా ను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత 2024 లో విడాకులు ఇచ్చాడు. వీళ్లకు ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం పాకిస్థాన్ టీవీ నటి సనా జావిద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాలిక్.. ఇప్పుడు మరోసారి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఈ వార్త విన్న భారతీయులు మాత్రం అసలు వీడు మనిషేనా..? అంటూ సోషల్ మీడియా పోస్ట్‌ల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.