BJP Andhra Pradesh president PVN Madhav : పెట్రోల్‌పై జీఎస్టీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచల వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై కేంద్రం విధిస్తున్న జీఎస్టీ 18 శాతమేనని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే జీఏస్టీ దీనికి రెండు రెట్లు అదనంగా ఉంటోందని అన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో రెండు రోజులు పాటు నిర్వహించిన ఖాదీ సంతను మాధవ్ సందర్శించారు. స్వదేశీ వస్తువులను విక్రయిస్తున్న అన్ని స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై కూడా ఒకే రేటు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదని తెలిపారు. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకునే నిర్ణయమన్నారు. దేశం అనేక విదేశీ సవాళ్లు ఎదుర్కొంటున్నా.. కేంద్రం జీఎస్టీని తగ్గించిందన్నారు. కాంగ్రెస్ అబద్ధాల కొట్టు నిర్వహిస్తుందని ఆరోపించారు. జీఎస్టీ 2.0 ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. తగ్గించిన జీఎస్టీని ఆరు సంవత్సరాల వరకు కేంద్రమే భరిస్తుందని వివరించారు.
READ MORE: Karnataka: కర్ణాటకలో దారుణం.. 12 ఏళ్ల కుమార్తెను చంపి తల్లి ఏం చేసిందంటే..!