Hidden Cameras: ఓయో హోటల్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి, దంపతుల సన్నిహిత దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అనేక నగరాల్లో చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఓయో రూమ్‌లో బుక్స్ చేసుకునే వారు అలర్ట్‌గా ఉండాలి. ఇకపై హోటల్లో మీరు బుక్ చేసుకున్న రూమ్‌లోకి వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు గదిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓయోనే కాదు.
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. రాజధానిలో 24 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదైంది. దీని కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 7.49 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. హర్యానాలోని రోహ్తక్, బహదూర్గఢ్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. నిన్న(గురువారం) కూడా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉదయం 9:04 గంటలకు సంభవించింది. దీని తీవ్రత 4.1గా నమోదైంది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో…
బీహార్‌లోని బెట్టియా నుంచి ఓ వింత ప్రేమ వ్యవహారం కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటన జూన్ 30న షికార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై స్పందించిన భర్త ప్రస్తుతం షికార్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ప్రకారం.. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు..
మీ వాహనంలో ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే.. ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే.. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కారు విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్స్టాల్ చేయని వారిపై కఠిన చర్యలకు పిలుపునిచచింది. వాస్తవానికి.. విండ్‌స్క్రీన్‌పై అతికించకపోవడాన్ని 'లూజ్ ఫాస్టాగ్' అంటారు. అలాంటి యూజర్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో వేస్తామని స్పష్టం చేసింది.
క్యాప్సుల్ హోటల్స్ గురించి తెలిసే ఉంటుంది. తక్కువ స్పేస్‌లో సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు వీటిని ఏర్పాఉటు చేశారు. వీటినే స్లీపింగ్ పాడ్లు అని కూడా పిలుస్తారు. తొలత అభివృద్ధి చెందిన జపాన్ దేశంలో ఇవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్లీపింగ్ పాడ్లు వ్యాపిస్తున్నాయి. ఈ అధునాతన విశ్రాంతి పడకలు ఇప్పుడు విశాఖ రైల్వే స్టేషన్లో సైతం ఏర్పాటు చేశారు. తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో తొలిసారి ఈ రకమైన వసతిని విశాఖలోనే ఏర్పాటు చేశామని డీఆర్ఎం లలిత్ బోహ్రా వెల్లడించారు. విశాఖ రైల్వేస్టేషన్‌లోని…
నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తాజా అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలి కాలుష్యం దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే సిగరేట్ తాగడం, ఇతరులు వదిలిన పొగతో పోలిస్తే ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలిలోని నుసి పదార్థం ఎంతవరకు దోహదం చేస్తోందనేది తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఊపిరితిత్తి క్యాన్సర్ అనేది కేవలం పొగతాగేవారికే వచ్చే జబ్బుగా పరిగణించేవాళ్లం.
ప్రతి నెలా ఆటో కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తూ.. కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. భారత్‌లో అగుడు పెట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా కూడా గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మొట్టమొదటి ప్రసిద్ధ కూపే ఎస్యూవీ సిట్రోయెన్ బసాల్ట్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీపై మాత్రమే కాకుండా.. C3, EC3, ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లకు కూడా మంచి ప్రయోజనాలు కల్పించారు.
45-Year-Old Man Marries 6-Year-Old Girl: ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని దేశాలలో బాల్య వివాహాలు కొత్తేం కాదు. అయితే, ఇటీవల ఇక్కడ ఓ బాల్య వివాహ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు.
కల్తీకల్లు కారణంగా చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితులు సంఖ్య పెరుగుతోందని.. కిడ్నీ పని చేయని వారి సంఖ్య 9 మందికి చేరిందని తెలిపారు. మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సి పరిస్థితి ఉన్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు.
Hyundai Venue July 2025 offer: జూలై నెలలో హ్యుందాయ్ కంపెనీ వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కంపెనీకి చెందిన రెండవ బెస్ట్ సెల్లింగ్ కారు హ్యుందాయ్ వెన్యూపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నారు. జూలై 2025లో హ్యుందాయ్ వెన్యూ కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ. 85,000 వరకు ఆదా అవుతుంది. నగదు తగ్గింపుతో పాటు, ఈ ఆఫర్లో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం.. కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ వెన్యూ ఫీచర్లు,…