కొందరికి వయసు పెరుగుతున్న పెళ్లి సెట్ అవ్వదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. అయితే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిషం ప్రకారం కుజుడుగా పేర్కొంటారు. ఈయనను మంగళుడు అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయట. కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు.
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.
హైదరాబాద్ సీపీఐ నాయకుడు చందు రాథోడ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ధిక విభేదాలు, వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అటు మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులోనూ ఫుల్ ఆధారాలు సేకరించారు పోలీసులు. ఆయనకు సన్నిహతంగా ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.
వందల ఎకరాల భూమి.. ఆ భూమికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు.. వారసులు లేరు.. అయితే తామే వారసులమంటూ ఒక వీలునామ పట్టుకొని ఇద్దరు వచ్చారు. 126 ఎకరాల భూమి తమ పేరు మీద వీలునామా రాసి మా వాళ్లు చనిపోయారంటూ పత్రాలు చూపెట్టారు. పేపర్లు చూసి అధికారులు నమ్మారు.. ఏకంగా 126 ఎకరాల భూమిని వాళ్లకు కట్టబెట్టారు. కానీ వీలునామా పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు. నకిలీ పత్రాలతో వందల కోట్ల విలువైన భూమి…
అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. తిరుపతి మంగళం బొమ్మల క్వార్టర్స్ లో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉషకు.. గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు. ఉషా, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో కాపురం సజావుగానే కొనసాగింది. ఐతే…
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..
లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది.
మహాభారతంలో ద్రౌపది కథను అందరూ వినే ఉంటారు. ఆమె ఐదుగురు భర్తలు. ఈ ఐదుగురు అన్నదమ్ములైన పాండవులు. అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి చేసుకునే సంస్కృతి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ సంప్రదాయంగా వస్తోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని శిల్లాయ్ గ్రామంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. శిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ఒకే వధువును వివాహం చేసుకున్నారు.
నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు. కాగా.. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రోజాకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి ఆర్కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని.. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.