నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు. కాగా.. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రోజాకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి ఆర్కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని.. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భార్య భర్తను దారుణంగా మోసం చేసింది. ఆమె తన భర్తను, పిల్లలను ఇంట్లో వదిలి తన ప్రియుడితో పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక హోటల్‌కు వెళ్లింది. భర్తకు ఇది తెలిసింది. అతను పిల్లలతో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. ప్రియుడితో భార్య ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా గది తలుపులు తెరిచాడు. తన భర్త, పిల్లను చూసిన భార్య తన బట్టలు సర్దుకుని అక్కడి పారిపోవడం ప్రారంభించింది.
సాధారణంగా పలు ఈవెంట్స్‌లో కొన్ని జంటలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. క్రికెట్ ను వీక్షించేందుకు వచ్చిన వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడం వంచి ఘటనలు చూసే ఉంటాం. అమెరికాలోని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కానీ.. ఓ జంట హగ్ చేసుకుంటున్న సమయంలో ఈ స్పాట్ లైట్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాష్ట్రపతి, ప్రధానితో పాటు, కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ గవర్నర్, ఏపీ డీజీపీ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులపై రాజ్యాంగ విరుద్ధ చర్యలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. 2024 జూన్ నుంచి మొత్తం 199 మంది పోలీసు అధికారులను పోస్టింగ్‌లు లేకుండా “వెయిటింగ్”లో ఉంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. మొత్తంలో 199 మంది పోలీసు అధికారుల్లో, నలుగురు ఐపీఎస్‌లు, 4 నాన్-కేడర్ ఎస్పీలు, 27 అడిషనల్…
లిక్కర్ స్కాం క్లైమాక్స్‌కి చేరింది. నాలుగు నెలలుగా లిక్కర్ స్కాంపై సిట్ విచారణ చేస్తోంది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ నుంచి కేసులో నిందితుల అరెస్ట్ మొదలు పెట్టింది. మొదటి కేసులో మిథున్ రెడ్డి కీలకమని సిట్ చెబుతోంది. ఒక సారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని విచారించింది. కేసులో టెక్నికల్ ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచింది.
రపా రపా డైలాగ్ పై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రపా రపా భాష వాడటం తప్పన్నారు. తప్పని తెలుసుకోవాల్సిందిపోయి సమర్దించడం కరెక్ట్ కాదని తెలిపారు. సినిమాల్లో చెప్పినప్పుడు బయట చెబితే తప్పేంటంటారని.. సినిమాల్లో చేసేవన్నీ బయట చెప్పాలనుకోవడం తప్పే అని స్పష్టం చేశారు. సినిమాలో బాలకృష్ణ తొడకొడితే 20 సుమోలు గాల్లోకి ఎగురుతాయి.
ప్రస్తుతం రీల్స్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్ లు, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. పక్కనొళ్లు ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న పర్వాలేదు.. వీళ్లు మాత్రం రీల్ చేస్తుంటారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. భర్త హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. భార్య మాత్రం రీల్ చేస్తోంది.
రాజకీయాలు పూర్తి కలుషితం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం మీడియాతో మాట్లాడారు. నేరస్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్న ఈ నేరస్థులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికల ముందు మోసపోయానని.. ఎప్పుడూ నేను నేరం చేశానా.. హత్య రాజకీయాలు చేశానా..? అని ప్రశ్నించారు.
మద్యం మత్తులో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికీరాతకంగా కత్తితో నరికి చంపాడు కొడుకు.. చావడి కోటకు చెందిన మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62) కుమారుడు మల్లిరెడ్డి.