రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ నెలకొంది. సిట్ అధికారులు కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు. దీంతో సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పోలీసుల సైతం భారీగా తరలివచ్చారు. జైలు గేటుకు కొంత దూరంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలందరినీ అక్కడే నిలువరించారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు.. రాజకీయ కుట్రలలో భాగంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని తప్పుడు పద్దతిలో ఇరికించారన్నారు. ఇది కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకార చర్య..లిక్కర్ స్కాం కేవలం మీడియాను, ప్రజలను నిజమైన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు..
మద్యం స్కాంలో త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతారని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలన్నారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్‌లో విజయ సాయి రెడ్డి వాటాలు తేలక బయటపడ్డారని ఆరోపించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్‌లో ముఖ్య భూమిక వహించారని ఆరోపించారు. క్యాబినెట్లో మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారణ చేయాలని ప్రభుత్వానికి కోరనున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబును మించిన క్రిమినల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరూ లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ…
మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మొబైల్లో రమ్మీ ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వివాదం మొదలైంది. ఈ సంఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. శివసేన కూడా మాణిక్‌రావ్ కోకటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజర్చిన విషయం తెలిసిందే. ఈ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమన్నారు.
ఆమదాలవలస వైసీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం నిర్వహించారు. మిథున్ రెడ్డి అరెస్టుపై ఆయన స్పందించారు. వంశీ, పూసాన కృష్టమురళి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా అనేక మంది నాయకులు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు, హత్యలు పెరుగుతున్నాయని..
కొందరికి వయసు పెరుగుతున్న పెళ్లి సెట్ అవ్వదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. అయితే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిషం ప్రకారం కుజుడుగా పేర్కొంటారు. ఈయనను మంగళుడు అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయట. కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు.
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.