Liver Health: కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, నిర్విషీకరణతో సహా సుమారు 500 విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, కాలేయ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చెబుతారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. కాలేయం ఊరికే దెబ్బతినదు..దానికెన్నో కారణాలుంటాయి. ఆహార నియమాలు పాటించకపోవడం, ఆల్కహాల్, పొగ విపరీతంగా తాగడంతో అనర్థాలను తెచ్చుకుంటారు. తరచుగా జబ్బులతో కాలేయం దెబ్బతింటున్నట్టు సంకేతాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఏవో కొన్ని రకాల మందులను కొని వేసుకుంటారు. కానీ కాలేయం పరీక్ష చేయించుకుంటే సమస్య ఏ స్థాయిలో ఉంది..? ఎందుకు కాలేయం దెబ్బతిందో తెలిసిపోనుంది. ఈ పరీక్ష గురించి వైద్యులు పలు సూచనలు చేశారు.
READ MORE: IPPB GDS Executive Recruitment 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో 300 జాబ్స్.. మంచి జీతం
శరీరంలోనే అతి పెద్ద అవయవం కాలేయం. .దాదాపుగా 500 రకాలకుపైగా విధులను నిర్వహిస్తుంది. ఆహారంలోని కొవ్వులను వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్య రసాన్ని నిరంతరం స్రవిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను వేరు చేస్తూ మనకు రక్షణ కవచంలా పని చేస్తుంది. ఎంతో కీలకమైన కాలేయానికి హెపటైటీస్ ఇన్‌ఫెక్షన్లు, మద్యం, కొవ్వుపదార్థాలు, నిత్యం మనం మింగే మందులు కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలేయానికి వచ్చే సమస్యల ఆనవాళ్లను గుర్తించేందుకు లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎంతో ఉపకరిస్తుంది. రక్తంలో స్రవించిన ఎంజైమ్‌లు, ప్రోటీన్లు, బైలూరూబీన్ రసాయనాల శాతాల ఆధారంగా కాలేయం ఆరోగ్యాన్ని, కాలేయ వ్యాధుల తీరు తెన్నులను వైద్యులు అంచనా వేస్తారు. కామెర్లు కావడం, రక్తం తొందరగా గడ్డ కట్టకపోయినా లివర్ సమస్య ఉందని గమనించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి..