UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం సోషల్ మీడియా నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపట్టింది. రెచ్చగొట్టే వీడియోలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం.
READ ALSO: Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు
Also Read
అసలు వివాదం ఏమిటంటే..
ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని యుఏఈ ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు కల్పిత వీడియోలను సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నించారని ‘వామ్’ (WAM) వార్తా సంస్థ వెల్లడించింది. నిందితులు చేసిన తప్పిదాల ఆధారంగా ప్రభుత్వం వారిని మూడు గ్రూపులుగా విభజించింది.
వీడియో ట్యాంపరింగ్ (10 మంది): క్షిపణి దాడుల పాత వీడియోలకు తమ సొంత గొంతులు, తప్పుడు వ్యాఖ్యానాలను జోడించి, ప్రస్తుతం దాడులు జరుగుతున్నట్లు భ్రమ కలిగించినందుకు ఐదుగురు భారతీయులతో సహా 10 మందిపై చర్యలు తీసుకున్నారు.
AI సృష్టించిన నకిలీ క్లిప్‌లు (7 మంది): కృత్రిమ మేధ (AI)ని ఉపయోగించి యుఏఈలో పేలుళ్లు జరుగుతున్నట్లు కల్పిత వీడియోలు సృష్టించినందుకు ఐదుగురు భారతీయులు సహా ఏడుగురిని గుర్తించారు. వీరు వీడియోలకు యుఏఈ జెండాను చేర్చి అసలైన దృశ్యాలుగా నమ్మించే ప్రయత్నం చేశారు.
శత్రు దేశాలకు మద్దతు (6 మంది): యుఏఈ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా శత్రు దేశాల సైన్యాన్ని, నాయకులను ప్రశంసిస్తూ వీడియోలు చేసినందుకు ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీపై కేసు నమోదైంది.
భారీ జరిమానా.. జైలు శిక్ష!
ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 35 మందిలో 19 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి యుఏఈ చట్టాల ప్రకారం కనీసం ఒక ఏడాది జైలు శిక్షతో పాటు 1,00,000 దిర్హామ్‌ల (సుమారు రూ.22.5 లక్షలు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. యుఏఈలో నివసిస్తున్న భారతీయులు ఎవరూ కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించిన దృశ్యాలను లేదా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని భారత ప్రభుత్వం, అక్కడి అధికారులు హెచ్చరించారు. దేశ భద్రతకు భంగం కలిగించే ఏ చిన్న చర్యకైనా కఠిన శిక్షలు తప్పవని యుఏఈ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు