మద్యం మత్తులో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికీరాతకంగా కత్తితో నరికి చంపాడు కొడుకు.. చావడి కోటకు చెందిన మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62) కుమారుడు మల్లిరెడ్డి.
ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి చాలాకాలంగా సహజీవనం చేస్తున్నట్లైతే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సుప్రీం కోర్టు గతంలో స్పష్టం చేసింది. వారికి పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు కూడా ఉంటుందని తేల్చి చెప్పింది. సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వారి తదనంతరం వారసులకు లేదా రక్తసంబంధీకులకు చెందుతాయి.
Floating Stone: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గంగా నది నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న నీటి మట్టంతో సహా చాలా వస్తువులు తేలుతూ వస్తున్నాయి. కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద ఉదయం ఒక రాయి తేలుతూ కనిపించింది.
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. కానీ అలాంటి ఇంటి దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్న ఇంటిలోనే చోరీ చేసిన చెల్లెల్ని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ గాజులరామారంలోని షిరిడీ హిల్స్‌లో కొంత కాలంగా వేముల శ్రీకాంత్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నారు. కొత్త కారు పూజ కోసం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులతోపాటు చెల్లెలు ఆమని కూడా…
థాయ్‌లాండ్‌లో ఓ యువతి విసిరిన వలపు వల ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. ఏకంగా బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసింది ఆ యువతి. అంతే కాదు మూడేళ్ల నుంచి వారి వద్ద నుంచి రూ. 102 కోట్లు కొల్లగొట్టింది. 2024లో ఈ యువతి హనీ ట్రాప్ షురూ చేసింది. ఓ సన్యాసితో సంబంధం ఏర్పరచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
మద్యం కుంభకోణంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనం ఎలా దోచుకోవచ్చో మద్యం స్కామ్ ఒక పరాకాష్ఠ అన్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు నియమితులపైన విషయం తెలిసిందే. నేడు ఆయనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్ గా నియామకంపై అశోక్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు.
తాడిపత్రిలో వైసీపీ మీటింగ్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. అనంతపురంలో డంపింగ్ యార్డును తీసేసేందుకు రూ. 24 కోట్లు ఖర్చుపెట్టారని.. తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కు పది కోట్లు ఇచ్చారన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిపారు. వైసీపీ నాయకులు మీటింగ్ తర్వాత చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్లారన్నారు. రోడ్డుపైన వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేశారని చెప్పారు. మున్సిపాలిటీ కార్మికులు స్ట్రైక్ లో ఉన్నారని.. కౌన్సిలర్…
ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుకుంటున్న చిన్నారి ప్రతిభకు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు. ఈ చిచ్చరపిడుగుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు.