Premanand Maharaj: ప్రేమానంద్ మహారాజ్ కోలుకోవాలని మదీనాలో ప్రార్థించిన ముస్లిం వ్యక్తి.. (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Premanand Maharaj: ప్రేమానంద్ మహరాజ్ ఆరోగ్యంగా ఉండాలని మదీనాలో ముస్లిం వ్యక్తి ప్రార్థించాడు. బృందావనంలో నివసించే సాధువు త్వరగా కోలుకోవాలని ఇస్లాం మతంలోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటైన మదీనాలో ప్రార్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుఫియాన్ అలహాబాద్ అనే యువకుడు ఈ వీడియో రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సర్వమత ఐక్యతకు చిహ్నంగా మారింది. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాదాపు 1 నిమిషం 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సుఫియాన్ అలహాబాద్ మదీనా పవిత్ర నేలపై రెండు చేతులు పైకెత్తి నిలబడి.. ఓ అల్లాహ్, దయచేసి భారతదేశ గొప్ప సాధువు ప్రేమానంద్ మహారాజ్ త్వరగా ఆరోగ్యవంతుడిని చేయ్యాలని ప్రార్థించారు.
READ MORE: Pawan Kalyan: పవన్ కల్యాణ్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
Also Read
అతను తన ఫోన్‌లో సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఫోటోను చూపిస్తూ.. “నేను గంగా-యమున సంగమం ఉన్న ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చాను. సంత్ ప్రేమానంద్ మహారాజ్ చాలా మంచి వ్యక్తి. ఆయన అనారోగ్యంతో ఉన్నారని మాకు తెలిసింది. మేము ఇప్పుడు ఖిజ్రాలో ఉన్నాం. అల్లాహ్ ఆయనకు ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని ఇక్కడి నుంచి ప్రార్థిస్తున్నాం. మేము భారతదేశం నుంచి వచ్చాం. మేము ప్రేమానంద్ మహారాజ్‌ను ఆరాధిస్తాం. ఆయన చాలా మంచి వ్యక్తి.” అని పేర్కొన్నాడు. అయితే.. పవిత్ర మక్కాకు సమీపంలో ఉన్న సౌదీ అరేబియాలోని ఒక పవిత్ర నగరం.
READ MORE: Kavitha : లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మత సహనాన్ని ప్రదర్శించినందుకు ప్రశంసించారు. “ఆమీన్!!! మన మాతృభూమిలో శాంతి, సోదరభావం, సామరస్యం, శ్రేయస్సు నెలకొనాలి. జై భారత్” అని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, సూఫియాన్ వీడియోను ప్రశంసించారు. మదీనా షరీఫ్ పవిత్ర స్థలం నుండి ప్రేమానంద్ మహారాజ్ కోసం సూఫియాన్ ప్రార్థించడం మానవత్వానికి నిజమైన ఉదాహరణ అని బరేల్వి అన్నారు. ఇదిలా ఉండగా.. సంత్ ప్రేమానంద్ మహారాజ్ కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బృందావనంలోని శ్రీ రాధేహిత్ కెలికుంజ్ ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారు. ఆశ్రమం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది.
मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं… ❤️
पैगंबर हज़रत मुहम्मद ﷺ के घर पहुँची प्रेमानंद महाराज के स्वस्थ होने की दुआ।
प्रयागराज के एक शख़्स ने शेयर किया ये वीडियो।#Madina | #PremanandMaharaj pic.twitter.com/ZUUhhKH8T0— Waseem Zaidi (@NewsZD) October 13, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!