Komali Suicide Case: యూట్యూబర్ కోమలి కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్ ఫ్రెండ్ సంచలన స్టేట్‌మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komali Suicide Case: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది. అయితే.. తాజాగా అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దీంతో కోమలి స్నేహితులు వీడే కారణం అంటూ విరుచుకుపడ్డారు. కోమలి సూసైడ్ లెటర్ లో కూడా అఖిల్ పేరు ఉందని స్నేహితులు తెలిపారు. ఈ అంశంపై తాజాగా రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడారు. “నిన్న ఉదయం మాకు కాల్ వచ్చింది. చిత్రపురి కాలనీలో వెళ్లి చూశాం.. ఒక ఫ్లాట్ లో కోమలి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. చిత్రపురి కాలనీలోనే ఉండే.. అఖిల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఆత్మహత్యకి అఖిల్ కారణం అని కోమలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.. దర్యాప్తు చేస్తున్నాం.. అఖిల్ కూడా మా ముందు వచ్చి హాజరయ్యాడు. కోమలి ప్రేమలో ఉన్నమాట వాస్తవమే కానీ.. విడిపోయాం అని చెప్తున్నాడు.. నేను వేరే యువతితో రిలేషన్‌లో ఉన్నాను. నన్ను వదిలేయ్ అని కోమలికి చెప్పాను.. కానీ తను వినకుండా ఇబ్బంది పెట్టింది అని అఖిల్ చెప్తున్నాడు. అఖిల్, కోమలి వ్యవహారం తల్లికి తెలుసు.. ఏడాది క్రితం తల్లి సమక్షంలోనే వీరిద్దరూ మాట్లాడుకున్నారు.. ఆత్మహత్యకి ముందు కోమలి తల్లికి మెసేజ్ చేసింది. ఐ లవ్ యూ మమ్మీ.. తమ్ముడిని బాగా చూసుకో జాగ్రత్త అని మెసేజ్ చేసింది.” అని సీఐ వెల్లడించారు.
READ MORE: Minister Nara Lokesh: VSR ఏవియేషన్స్తో ఎలాంటి లావాదేవీలు లేవు.. ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కోమలి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లోని ఓ మహిళ కోమలి మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కోమలి మాకు తెలుసు. ఆ అమ్మాయి చాలా మంచిది. ఫ్రెండ్లీగా ఉండేది. అందరితో కలిసి ఉండేది. మా పిల్లలతో చాలా బాగా కలిసి పోయేది. మాతో ఫైనాన్షియల్, లవ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు ఏ విషయాన్ని షేర్ చేసుకోలేదు. ఎవరో మోసం చేస్తే బాధ పడుతున్నట్లు కూడా ఎప్పుడూ కనిపించేది కాదు.. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండేది. కానీ ఏం జరిగింది? అనేది మాకు తెలియదు. సంక్రాతికి ముందు మేము టూర్‌కి వెళ్లాలనుకున్నాము. అరుణాచలం, తిరుపతి తిరగాలనుకున్నాం. తాను కూడా వస్తానంది. మేము వెళ్లే రోజు నైట్ మా ఇంటికి వచ్చింది. అదే లాస్ట్ నేను చూసింది.” అని వివరించారు.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!