Salman Ali Agha Wife: “అలా చేస్తే పాక్ టీ20 వరల్డ్ కప్ గెలవదు”.. పాకిస్థాన్ కెప్టెన్ భార్య ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Ali Agha’s Wife: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. అయితే.. మైదానంలో ప్రత్యర్థులతో పోరాటం కంటే సొంత దేశస్థులతో పాకిస్థాన్ టీమ్ అనేక అవమానాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాకిస్థాన్ కెప్టెన్‌ను తీవ్రంగా దూషిస్తున్నారు. సల్మాన్ అలీ అఘా భార్య సబ్బా మంజర్, కుమారుడిని కూడా వదలడం లేదు. దీంతో తాజాగా మంజర్ సోషల్ మీడియా వేదికగా వస్తున్న దుర్భాషలపై స్పందించింది. “నన్ను లేదా నా అమాయక బిడ్డను తిట్టడం వల్ల పాకిస్థాన్ వరల్డ్‌కప్ గెలవదు” అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి, తన సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్‌గా మార్చుకుంది. ఈ సంఘటన క్రికెట్ అభిమానుల ప్రవర్తనపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. గ్రౌండ్‌లో ఆడిన ప్లేయర్స్‌పై కాకుండా కుటుంబీకులపై సైతం పాకిస్థాన్ అభిమానులు విషం చిమ్మడం దారుణంగా కొందరు అభివర్ణిస్తున్నారు. పాక్ వక్ర బుద్ధి గురించి తెలిసిన వాళ్లు ఇది అక్కడ కామన్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
Also Read
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీలో ఇంగ్లండ్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ మంచి ఆరంభం చేసినా, చివర్లో చెతికల పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 9 వికెట్ల నష్టానికి 164 పరుగులకే పరిమితమయ్యారు. సాహిబ్జాదా ఫర్హాన్ 63 పరుగులతో నిలబడగా, బాబర్ ఆజాం, ఫకీర్ జామన్, షాదాబ్ ఖాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలోలియామ్ ఆండ్రూ డాసన్ (3/24) పాకిస్థాన్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లు సైతం కీలక వికెట్లు తీసి రన్‌రేట్‌ను నియంత్రించారు. లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించేశాడు. ఈ మ్యాచ్ అనంతరం.. పాక్ కెప్టెన్ సల్మాన్ మాట్లాడుతూ.. తమ జట్టు మంచి స్టార్ట్ తీసుకున్నప్పటికీ చివర్లో ఫినిషింగ్ లోపించిందని ఒప్పుకున్నాడు. బ్రూక్ బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. మేము అన్ని బౌలింగ్ ఆప్షన్లు ప్రయత్నించాం, కానీ బ్రూక్ మ్యాచ్‌ను గెలిపించేశాడన్నాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు