Hyderabad: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్‌ట్విస్ట్ ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో బిగ్‌ట్విస్ట్ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ కి చెందిన రోషన్‌సింగ్(25) ఓ రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్‌సింగ్ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్ బాలానగర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం రోషన్, అతని మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన శత్రువు బాలశౌరెడ్డి ట్రాన్స్‌జెండర్‌తో కేసు పెట్టించాడని రోషన్ అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైన చంపేస్తానని మిత్రులతో చెప్పేవాడు. ఈ విషయం కాస్త బాలశౌరెడ్డికి తెలిసింది. వాడు నన్ను చంపడం ఏంటి నేనే వాడిని చంపేస్తానని బాలశౌరెడ్డి ఫిక్స్ అయ్యాడు.
READ MORE:Thalaivar173 : రజనీకాంత్ హీరోగా.. కమల్ హాసన్ నిర్మాతగా దర్శకుడు ఎవరంటే?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోషన్‌సింగ్, బాలశౌరెడ్డి, స్నేహితులు ఆదిల్, మహ్మద్ కలిసి మద్యం తాగారు. గొడవ పెట్టుకుంటూ జగద్గిరిగుట్ట చివరి బస్టాపు వద్దకు చేరుకున్నారు. ఉన్నట్టుండి రోషన్‌ను మహ్మద్ పట్టుకోగా బాలశౌరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అనంతరం బైకుపై సిద్ధంగా ఉన్న ఆదిల్‌తో కలిసి బాలశౌరెడ్డి పారిపోయాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే విచక్షణ రహితంగా పొడిచాడు బాలశౌరెడ్డి. ఇది చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Sudheer Babu : ‘బాహుబలి’ రేంజ్ కాన్సెప్ట్‌తో కొత్త మూవీకి సైన్ చేసిన సుధీర్ బాబు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..