Telangana Lightning Tragedy: పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల పరిధిలో ఆరుగురు పిడుగు పాటుకు బలయ్యారు. నిల్మల్ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్‌లో ముగ్గురు మృతి చెందారు.
రైతులకు రెవెన్యూ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
ISIS Links Suspect Arrested in Bodhan: బోధన్‌లో ఉగ్రలింకుల కలకలం సృష్టించింది.. అదుపులో అనీసనగర్ వాసి మహమ్మద్ ఉజైఫా యామన్ ఢల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఐసీస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర మూలాలు సంబంధాలపై విచారణ చేపడుతున్నారు.
Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో ఓ ఇంటిపై పిడుగుపాటు చోటుచేసుకుంది. పట్టణంలోని భగవంతు రావునగర్‌లో నివాసముంటున్న చిలుకల దేవయ్య ఇంటిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
France Protests - Block Everything: నేపాల్ తర్వాత.. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. రాజధాని పారిస్‌లో నిరసన కారులను నియంత్రించడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.
Telangana Joint Staff Council Appointed: ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం చేపట్టింది. అందులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది.
China Statement Nepal Crisis: నేపాల్‌లో కొనసాగుతున్న గందరగోళం, తిరుగుబాటుపై చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లోని అన్ని పార్టీలు సమిష్టిగా ఉండి.. దేశీయ సమస్యలను పరిష్కరించుకోవాలని, సామాజిక క్రమం, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని చైనా కోరింది. నేపాల్ పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తొలిసారి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "చైనా, నేపాల్ దేశాలు సాంప్రదాయక, స్నేహపూర్వక పొరుగు సంబంధాలను కలిగి ఉన్నాయి.
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై మాట్లాడారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీనికి ప్లానింగ్ అంత కిషన్ రెడ్డి చేశారని ఆరోపించారు. తాను ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు.. కేంద్ర పెద్దల ఆశీర్వాదం, యోగి ఆధిత్యానాథ్ ఆశీర్వాదం తనకు ఉందన్నారు. గోషామహాల్లో ఎవరికి పార్టీ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఇవాళ కూడా నా బీజేపీనే రేపు కూడా నా బీజేపీ…
MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.
Jagtial Village Caste Exclusion: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని కుల(SC) పెద్దలు గ్రామానికి చెందిన గాలిపెల్లి అరుణ్, గంగ లచయ్య, అంజి, సూర్య వంశీల నాలుగు కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు.