Jagtial Village Caste Exclusion: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని కుల(SC) పెద్దలు గ్రామానికి చెందిన గాలిపెల్లి అరుణ్, గంగ లచయ్య, అంజి, సూర్య వంశీల నాలుగు కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు.
Lovers Suicide: ఇద్దరూ ప్రేమించుకున్నారు...!! చదువు పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు !! ఇంతలోనే ప్రియురాలు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా మంచిర్యాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం అంటూ... సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పుట్టిన ప్రేమ... ఇద్దరినీ బలికోరింది. ఇంతకు ఆ యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు !! ఇద్దరి ఆత్మహత్య వెనకా దాగున్న మిస్టరీ ఏంటి..?
Hyderabad: ముగ్గురూ.. స్నేహితులు ! పొట్టకూటి కోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు !! ముగ్గురూ ఒకేచోట పనిలో చేరారు. కలిసి పనిచేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టింది. తన భార్యపై కన్నేశాడని తెలుసుకుని స్నేహితుడిని మందలించాడు..!! పలుమార్లు హెచ్చరించాడు..!! ఐనా తీరు మార్చుకోకపోవడంతో కక్షగట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని తెలివిగా చేధించారు పోలీసులు.
Waze Navigation App: టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు పోలీసులు వాహనాలను ఆపి చలాన్లు రాసేవారు. తరువాత కెమెరాలు వచ్చాయి. నగరాల్లోని కూడళ్లలో పోలీసులు కెమెరాల ద్వారా ఫొటోలు తీసి ఆన్లైన్లో చలానాలు విధిస్తున్నారు. పెద్ద నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వాటిని రహస్య ప్రాంతాల్లో పెట్టడం, వాహనదారుడు గమనించకపోవడం వల్ల చలాన్ పడుతుంది.
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఫలితాలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.. "ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నా.. ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చింది.. న్యాయం, ప్రతీ వ్యక్తి యొక్క గౌరవం కోసం నిలబడే అవకాశం అందించింది. నన్ను కూటమి అభ్యర్థిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు." అని లేఖలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి…
Vice Presidential Election:ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా అలయన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఇండియా అలయన్స్ కు చెందిన కనీసం 20 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఊహించిన దానికంటే 25 ఓట్లు ఎక్కువగా పొందారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థికి మద్దతుదారుల పూర్తి స్థాయిలో ఓట్లు రాలేదు.
C.P. Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి బి.కె. సుదర్శన్ రెడ్డి్ 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. దీంతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ బలం 427 కాగా.. క్రాస్ ఓటింగ్ జరగడంతో 452 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో దేశంలోని 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నిలిచారు. ఈ ఎన్నికల్లో 98 శాతం మంది ఎంపీలు…
Vice Presidential Election: దేశంలోని 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభతో సహా మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం రెండు సభలలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే.. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. వారిలో 13 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు.
2025 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ పూర్తయింది. ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నాటికి కొత్త ఉపరాష్ట్రపతి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. 96 శాతం మంది సభ్యులు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదైందనే అంశంపై క్లారిటీ లేదు.