Hot Shower After Gym: ఇటీవల, 24 ఏళ్ల వ్యక్తి జిమ్ తర్వాత వేడి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయాడని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి జిమ్ తర్వాత మనం స్నానం చేయడం సర్వసాధారణం. కానీ.. వ్యాయామం అనంతరం వెంటనే వేడి నీటి జల్లులు శరీరంపై పడటం కొంతమందికి ప్రమాదకరం. ఈ అంశంపై హెచ్చరిస్తూ ఓ అమెరికన్ వైద్యుడు కీలక సూచనలు చేశారు. అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ కునాల్ సూద్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఆయన జిమ్ తర్వాత వేడి స్నానం చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించారు.
READ MORE: Netflix : నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం.. సౌత్ సినిమాలకు ఇక కష్టమే
డాక్టర్ సూద్ ప్రకారం.. మనం కఠినమైన వ్యాయామం చేసినప్పుడు.. మన రక్త నాళాలు విస్తరిస్తాయి. శరీరంలో వేడి నీరు చెమట రూపంలో బయటకు వెళుతుంది. కండరాలు, అవయవాలకు తగినంత రక్త సరఫరాను నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియను వైద్యపరంగా వాసోడైలేషన్ అంటారు. వ్యాయామం తర్వాత కొంత సమయం వరకు ఇది కొనసాగుతుంది. శరీరం క్రమంగా చల్లబరుస్తుంది. వ్యాయామం తర్వాత వెంటనే వేడి స్నానం చేస్తే.. శరీరంలోని రక్త నాళాలు మరింత విస్తరిస్తాయి. దీనివల్ల రక్తపోటు(బీపీ) అకస్మాత్తుగా పడిపోతుంది. చేతులు, కాళ్ళలో రక్తం పేరుకుపోతుంది. దీంతో తలతిరగడం, బలహీనత లేదా అకస్మాత్తుగా మూర్ఛపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీనిని వైద్య పరిభాషలో హాట్ షవర్ సింకోప్ అంటారు.
READ MORE: Russia-Ukraine: ట్రంప్ శాంతి ప్రణాళికకు పుతిన్ ఖుషి.. జెలెన్‌స్కీ తిరుగుబాటు!
జిమ్ తర్వాత వెంటనే వేడి స్నానం చేయడం ప్రమాదకరం.. అందుకే.. స్నానం చేయడానికి ముందు 5 నుంచి 10 నిమిషాలు వేచి ఉండాలి. వ్యాయామం తర్వాత, శరీరం చల్లబరచడానికి సమయం దొరికేలా కాసేపు కూర్చోండి లేదా పడుకోండి. అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. వ్యాయామానికి ముందు, తరువాత తగినంత నీరు త్రాగండి.. తద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.. రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. మీకు ఒకవేళ తల తిరుగుతున్నట్లు అనిపిస్తే.. వేడి నీటితో స్నానం చేయకండి. వ్యాయామం, వేడినీటి జల్లులు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ సమయం, పద్ధతి చాలా కీలకం. జాగ్రత్తలు పాటించండి.