Mrunal Thakur: సినిమా తారలు ఎల్లప్పుడూ వారి చర్మం, ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొందరి ముఖాలు మేకప్ లేకుండానే మెరిసిపోతుంటాయి. సీతారామం నటి మృణాల్ ఠాకూర్ కూడా తన మెరిసే చర్మానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఫోటోలను పంచుకుంటుంది. ఇటీవల.. ఒక ఇన్‌స్టా రీల్లో మృణాల్ రాత్రి పడుకునే ముందు తాను ఒక ప్రత్యేక నూనెను ఉపయోగిస్తానని చెప్పింది. తన తల్లి దాన్ని సజెస్ చేసినట్లు వెల్లడించింది. ఆ రీల్ లో ఆ నూనెను…
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అమరులయ్యారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. శత్రుదేశం పాక్ కాల్పుల్లో మన దేశానికి […]
యూపీ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసుకున్నాడు. గదిలో నొప్పితో విలపించడంతో గమనించిన చుట్టుపక్కల వ్యక్తులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని అందరూ కంగుతిన్నారు. నిజానికి.. ఆ యువకుడు తన లింగాన్ని మార్చుకోవాలనుకున్నాడు. దీని కోసం ముందుగా తనకు తాను అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకున్నాడు.
Medicine Profit Margins Exposed: ప్రస్తుత కాలంలో రోగాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి ఆసుపత్రి, మెడికల్ షాపులకు పరుగులు తీస్తుంటాం. కానీ.. అక్కడ జరిగే మోసాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనం కొనే మందుల అసలు ధర, దానిపై వచ్చే లాభం సామాన్యులకు అర్థం కాదు. ఉదాహరణకు ఓ దగ్గు మందును రూ. 100కి కొనుగోలు చేశామనుకుందాం.. మెడికల్ స్టోర్ యజమానికి అదే మందును ఎంతకు కొనుగోలు చేస్తాడు? దానిపై ఎంత మార్జిన్ వస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి…
UP: ఢిల్లీలో శ్రమించి తన కుటుంబాన్ని పోషించిన ఓ తండ్రికి అనుకోని ఘటన ఎదురైంది. 32 సంవత్సరాల పాటు ఇంటిని తన తొమ్మిది మంది పిల్లలను కష్టపడి పెంచిపోషించాడు. ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడికి వివాహం జరిపించాడు. అంతా సవ్యంగానే ఉందనుకునేలోపే విధి అతన్ని కాటేసింది. అతడి భార్య, తొమ్మిది మంది పిల్లలకు తల్లి అకస్మాత్తుగా తన ప్రేమికుడితో పారిపోయింది. పోతు పోతు నగలు, భూమి పత్రాలు, చిన్న కుమార్తెను తీసుకొని పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
CM Revanth Reddy: హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 4 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రోడ్లు మునిగిపోయాయి.
Why Dogs Attack Humans: శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతిరూపమైన జంతువు అంటాం. ఇవి ఇంటిని, మనల్ని దొంగల నుంచి ఆపద సమయాల్లో రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రక్తం రుచి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. నిత్యం ఏదో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు…
Hyderabad: పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేసి, డైమండ్స్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని సైఫాబాద్, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. ముంబైకు చెందిన బంగారం వ్యాపారి విపుల్ షా తరుచూ హైదరాబాద్‌కు డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కొరియర్ లో పంపించేవాడు. అలాగే వారి ఎగ్జిక్యూటివ్స్ వాటిని తీసుకొని, హైదరాబాద్‌లో పలు బంగారు ఆభరణాల షాప్స్‌కు తిరుగుతూ... వాటిని అమ్మడం,…
పాతబస్తీ యాకుత్‌పురా మౌలాకా చిల్లా ప్రాంతంలో మ్యాన్‌హోల్ లో పడిపోయిన చిన్నారి ఘటనపై హైడ్రా దర్యాప్తు చేసింది. బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం వరకు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించింది. అసలు ఏం జరిగిదంటే.. స్థానిక కార్పొరేటర్ ఆదేశాలతో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ మట్టి తొలగించారు. జలమండలికి చెందిన జెట్టింగ్ మెషిన్ తో సిల్ట్ తొలగించారు. సిల్ట్ తొలగించిన అనంతరం మూత వేయకుండానే మరో మ్యాన్ హోల్ క్లీన్ చేయడానికి సిబ్బంది వెళ్ళింది.
RBI: మీరు ఈఎంఐ పద్ధతిలో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనను పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఒక కస్టమర్ వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనుగోలు చేసి, సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆయా బ్యాంకులు, రుణ సంస్థలు ఆ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేస్తాయి. ఈ నిర్ణయానికి ఆర్బీఐ తర్వలో అనుమతి ఇవ్వనుంది. వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే, బ్యాంకుల మొండి రుణాలను తగ్గించడానికి ఈ నిర్ణయం…