UP: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన ఏడు రోజులకే. వరుడిని తన ప్రేమికుడితో కలిసి నవ వధువు హత్య చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. పరశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేదిపూర్ గ్రామంలో అనిస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. అయోధ్య జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది.
READ MORE: HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సర్వీసులు రద్ధు..!
మృతుడు అనీస్ ఈ నెల 13న అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు. గోండా జిల్లా నివాసి అయిన రుక్సానాను వివాహం చేసుకున్నాడు. కానీ భార్యే తన ప్రాణాలను తీయబోతోందని అతనికి తెలియదు. పెళ్లి తరువాత వధువు పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బస్తీ జిల్లాలోని గౌర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే రింకును కలిసింది. రుక్సానా, రింకు గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. అనీస్‌ను వివాహం చేసుకోవడం రుక్సానాకు ఇష్టం లేదు. కుటుంబీకలు బలవంతం చేయడంతో అతనితో వివాహం చేసుకుంది. అనంతరంరుక్సానా తన ప్రేమికుడు రింకుతో కలిసి తన భర్త అనీస్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నింది.
READ MORE: Karnataka High Court: ద్విచక్ర వాహనాలపై పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
దీంతో రింకు తన స్నేహితుడు శివ్ తో కలిసి రుక్సానా అత్తమామల ఇంటికి చేరుకున్నాడు. అనీస్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. గమనించిన కుటుంబీకులు క్షతగాత్రుడిని అయోధ్య జిల్లాలోని ఆసుపత్రిలో చేర్చారు. అనీస్ చికిత్స పొందుతూ మరణించాడు. అనీస్ ముంబైలో క్రేన్ ఆపరేటర్ గా పనిచేశాడు. నవంబర్ 10న పెళ్లి కోసం ముంబై నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, రుక్సానా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
READ MORE: Karnataka High Court: ద్విచక్ర వాహనాలపై పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈ ఘటనపై ఎస్పీ అభినందన్ మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, నిఘా, ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని చెప్పారు. రుక్సానా చాలా సంవత్సరాలుగా రింకు అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఎస్పీ వివరించారు. ఆమె తన ప్రేమికుడితో కుట్ర పన్ని తన భర్తను హత్య చేసిందని స్పష్టం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.