Deputy CM Bhatti Vikramarka: ప్రపంచంలో పోటీపడే విధంగా మన బిడ్డలు ఎదగటం కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి స్కూలుకి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల ప్లాన్‌లో అత్యంత అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. దేశంలోనే ఇటువంటి స్కూల్స్ ఏ రాష్ట్రంలో కూడా నిర్మించడం లేదన్నారు. క్వాలిటీకి ఎక్కడ కొరతలేదని చెప్పారు.. గత 15లో రెసిడెన్షియల్ స్కూల్ అని బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది.. పోషకాహారం లేని భోజనాన్ని అందించింది.. ఆనాడు అరకొరగా పనికిరాని చీరలు గత ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. కట్టు
కోవడానికి పనికి వచ్చేటువంటి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
READ MORE: Mollywood Heroines : పెన్షన్ తీసుకునే వయసొస్తున్నపెళ్ళికి నో చెప్తున్న కేరళ కుట్టీలు..
పదేళ్లపాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ వడ్డీ లేనిరుణాలను ఇవ్వకుండా మహిళలకు అన్యాయం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. “ఏడాదికి 20,000 కోట్ల రూపాయలను మహిళలకి వడ్డీ లేని రుణాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది.. 20వేల కోట్ల రూపాయలు ఇవ్వటం సాధ్యమా? అని చాలామంది నవ్వారు.. కానీ మేము ఇచ్చి చూపిస్తున్నాం.. 27 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించింది.. ప్రజలందరి సమక్షంలో ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను అందిస్తాం.. ఇది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంకల్పం.. మహిళలకు పెట్రోల్ బంకులు అందిస్తున్నాం.. రెండు మెగావాట్లకు తగ్గకుండా సోలార్ పవర్లు మహిళలకి అందించనున్నాం. 93 లక్షల కుటుంబాలు సన్న బియ్యం పొందుతున్నారు. ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడం లేదు.. రూ.13,500 కోట్లు వెచ్చి సన్న బియ్యం అందిస్తున్నాం.. 53 లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం.. ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించి రికార్డు స్థాయిలో పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నాం..” అన్నారు. వైరాతో తనకు విడదీయ రాని అనుబంధం ఉందని భట్టి తెలిపారు. వైరా నుంచే రాజకీయ జీవితం ప్రారంభించానన్నారు. ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతున్నాం.. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వైరా నియోజకవర్గంలో శరవేగంగా సాగుతోందన్నారు. వైరా ప్రజల కోసం జైలుకు, కోర్టుకు వెళ్ళాని గుర్తు చేశారు.