Motorola Edge 70: మోటరోలా డిసెంబర్ 15న భారత మార్కెట్లో తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 ను లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒక్క వేరియంట్లోనే లభించనుండగా.. పాంటోన్ ఎంపిక చేసిన మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. Champion: రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్ […]
Champion: టాలీవుడ్ యంగ్ హీరో మేకా రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, మూవీ టీమ్ తాజాగా ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రోషన్ మేకా, భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ […]
ICC Rankings: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా ప్రపంచ నెం.1 స్థానం సాధించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అన్నబెల్ సదర్లాండ్‌ను వెనక్కి నెట్టి దీప్తి ఈ ఘనత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆమె చూపిన అద్భుత ప్రదర్శన ఈ విజయానికి కారణమైంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. […]
Rashid Khan: అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్వదేశంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా తాను బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తానని రషీద్ వెల్లడించాడు. తనకు ఉన్న ప్రజాదరణతో పాటు అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు అనూహ్య పరిస్థితులకు దారి తీయవచ్చని పేర్కొంటూ, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మారాయని స్పష్టం చేశాడు. WPL 2026: ఇట్స్ ఆఫీసియల్.. న్యూ సీజన్.. న్యూ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా […]
WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు జెమిమా రోడ్రిగ్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. గత మూడు సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్‌కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమిమా ఈ బాధ్యతలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భారతీయ క్రికెటర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఈ మార్పు చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. నిజానికి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి సంతకం చేసిన ఆటగాళ్లలో […]
Huawei MatePad 11.5 (2026): హువాయే (Huawei) తాజాగా టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ MatePad 11.5 (2026)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. nova 15 సిరీస్‌తో పాటు లాంచ్ అయిన ఈ టాబ్లెట్‌ను విద్య, వినోదం, సాధారణ వినియోగం కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్, సాఫ్ట్ లైట్, ఫుల్ నెట్వర్క్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త టాబ్లెట్ పూర్తి మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ఫోర్జింగ్, బెండింగ్ ప్రాసెస్ల […]
Huawei Nova 15: హువాయే (Huawei) సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Nova 15ను చైనాలో అధికారికంగా కౌంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో కంపెనీ రూపొందించిన Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 12GB RAMతో పాటు గరిష్టంగా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ […]
Maoists Surrender: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఒడిశా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వరుస ఆపరేషన్లు, భద్రతా బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఈ లొంగుబాటుకు ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 15 మంది కీలక మావోయిస్టు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు […]
Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని దేవస్థానానికి వెళ్తున్నానంటూ ఇద్దరు కూతుర్లు అనసూయ (11), చంద్రమ్మ (9)లను వెంట తీసుకెళ్లిన తండ్రి కొల్లాప్ప, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర లోలెవల్ (ఎల్ఎల్సి) కాలువలో వారిని తోసివేసాడు. దానితో కూతుర్లు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య శిల్పమ్మ భర్త కొల్లాప్పను నిలదీయగా.. గ్రామస్తుల సమక్షంలో అతడు తన కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. […]
itel Vista Tab: ఐటెల్ (itel) సంస్థ భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ Vista Tab 30ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, వినోద ప్రియులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. కేవలం 8mm సన్నని డిజైన్‌తో, సుమారు 550.5 గ్రాముల బరువుతో ఇది తేలికగా ఉంది. ఈ టాబ్లెట్‌లో 11 అంగుళాల FHD+ (1920 x 1200) డిస్ప్లే ఉంది. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన విజువల్ […]