Rashid Khan: బయటికి వెళ్లాలంటే బుల్లెట్‌ప్రూఫ్ కారు కావాల్సిందే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్
- అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
- భద్రతా కారణాల వల్ల బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణించాల్సి వస్తోందని వెల్లడి
- తన ప్రజాదరణ వల్ల అనూహ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్య
- మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో ‘ది స్విచ్’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan: అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్వదేశంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా తాను బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తానని రషీద్ వెల్లడించాడు. తనకు ఉన్న ప్రజాదరణతో పాటు అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు అనూహ్య పరిస్థితులకు దారి తీయవచ్చని పేర్కొంటూ, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మారాయని స్పష్టం చేశాడు.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
ఈ విషయాలను మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో కలిసి పాల్గొన్న ‘ది స్విచ్’ కార్యక్రమంలో రషీద్ ఖాన్ వెల్లడించాడు. అఫ్గానిస్తాన్‌లో సాధారణంగా రోడ్లపై స్వేచ్ఛగా తిరగడం తనకు సాధ్యం కాదని, అందుకే ఎప్పటికప్పుడు కఠినమైన భద్రతా ఏర్పాట్లతోనే బయటకు వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు. రషీద్ మాటలు విన్న పీటర్సన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఇంటర్వ్యూలో పీటర్సన్ రషీద్ ఖాన్ ను నువ్వు మీ దేశంలో సాధారణంగా రోడ్లపై తిరగగలవా అని ప్రశ్నించించాడు.
Rashid Khan Uses A Bulletproof Car When Visiting Afghanistan! 😮 pic.twitter.com/53BZkyWunp
— The Switch | Kevin Pietersen (@kptheswitch) December 22, 2025
దీనికి గాను రషీద్ స్పందిస్తూ.. అసలు ఛాన్స్ లేదు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. దానికి పీటర్సన్.. అవునా, నిజమా..? అసలెందుకు అలా అని అడిగాడు. దానికి సమాధానంగా.. తాను సాధారణ కారులో ప్రయాణించే అవకాశం లేదు. నేను తప్పనిసరిగా బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలి. నా సొంత బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే తిరుగుతాను అని రషీద్ ఖాన్ చెప్పాడు. అలాగే ఇది నా భద్రత కోసం అవసరం. నన్నెవరూ కాల్చబోరు. కానీ తప్పు చోట, తప్పు సమయంలో ఉంటే ప్రమాదం జరగవచ్చు. కార్ లాక్ అయి ఉంటుంది, అయినా కొందరు దాన్ని తెరవడానికి కూడా ప్రయత్నిస్తారు అని వివరించాడు.
తనకే ప్రత్యేకంగా ఈ భద్రతా ఏర్పాట్లు కాదని, అఫ్గానిస్తాన్‌లో ఉన్న చాలామంది ప్రముఖులు ఇదే తరహా భద్రతా చర్యలు తీసుకుంటారని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. నా కారును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. చాలా మంది ఇలాంటివే ఉపయోగిస్తారు. అఫ్గానిస్తాన్‌లో ఇది సాధారణ విషయమే అని అన్నాడు. దీనిపై స్పందించిన కెవిన్ పీటర్సన్ ఈ పరిస్థితిని ‘ఆసక్తికరమైన అంశమని అభివర్ణించాడు.
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?