Super Hit Pairs: సౌత్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్లతో మరోసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ జోడీల లైన్ అప్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఈ లిస్ట్ లో ముందుగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి చెప్పుకుంటే.. ఆయనతో టబు జోడీగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా 1996లో కృష్ణవంశి దర్శకత్వంలో విడుదలై […]
Jubilee Hills by-poll: రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో గల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 13 (సోమవారం)న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదలైంది. నామినేషన్లను స్వీకరించడానికి చివరి తేదీ అక్టోబర్ 21 (మంగళవారం)గా నిర్ణయించింది ఈసీ. అలాగే నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 (బుధవారం)న జరుగుతుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 24 (శుక్రవారం)గా నిర్ణయించారు. ఇక పోలింగ్ నవంబర్ […]
Tollywood Sequel Movies: స్టార్ హీరోల భారీ చిత్రాల సీక్వెల్స్ మాత్రమే కాకుండా మరోవైపు కేవలం కంటెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, ప్రేక్షకులను మెప్పించిన చిన్న చిత్రాల సీక్వెల్స్ కోసం కూడా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సీక్వెల్స్ శరవేగంగా షూటింగ్‌ను కూడా మొదలు పెడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరికొన్ని క్రేజీ చిన్న సినిమా సీక్వెల్స్ వివరాలు ఒకసారి చూసేద్దాం. నిజానికి, చిన్న హీరోలు సైతం ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. […]
Safe Ride Challenge: పౌరుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనర్ తాజాగా #SafeRideChallenge అనే సోషల్ మీడియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రోడ్డు భద్రతను వైరల్ ట్రెండ్‌గా మార్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా.. వాహనదారులు ప్రయాణం ప్రారంభించే ముందు హెల్మెట్ ధరించడం లేదా సీట్‌బెల్ట్ కట్టుకోవడం వంటి భద్రతా చర్యలను చూపిస్తూ ఒక చిన్న వీడియో లేదా ఫోటో తీసి, ముగ్గురు స్నేహితులను […]
Konda Lakshma Reddy: కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నింపుతూ.. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. IND vs AUS: వన్డే చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్.. టాప్ 5లో నాలుగు రికార్డులు ఆస్ట్రేలియావే! చేవెళ్ల మాజీ […]
Vivo X300, Vivo X300 Pro: Vivo X300 సిరీస్ నేడు (అక్టోబర్ 13) అధికారికంగా లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లోని స్మార్ట్ఫోన్లు ప్రపంచంలో తొలి MediaTek Dimensity 9500 SoC చిప్సెట్తో వచ్చే ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లుగా నిలువనున్నాయి. ఈ చిప్‌సెట్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించగా ఇది Snapdragon 8 Elite Gen 5కు పోటీగా వస్తోంది. Vivo X300 సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడల్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు తమ […]
iQOO 15: iQOO సంస్థ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15ను చైనా మార్కెట్లో కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్లో Snapdragon 8 Elite Gen 5 SoC చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది Xiaomi 17 సిరీస్ తర్వాత ఈ ప్రాసెసర్‌ను పొందిన రెండవ ఫోన్‌గా నిలుస్తుంది. తాజా లీక్‌ల ప్రకారం, iQOO 15 భారతీయ మార్కెట్లో నవంబర్ మధ్య లేదా చివరలో విడుదల కానుందని సమాచారం. భారత మార్కెట్లో ఈ ఫోన్ […]
Saidabad: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. హోమ్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం అనుమతి లేకుండా ఆ గార్డ్ బాలుడిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చెక్ చేయగా.. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. 50MP+50MP కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్ […]
Motorola Edge 70: మోటరోలా సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70ను నవంబర్ 5న గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. అధికారిక లాంచ్‌కు కొన్ని వారాల ముందు ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్సైట్లో కనిపించడంతో దాని డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లను తెలిసిపోయాయి. లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్సెట్, 12GB RAMతో వస్తుంది. పోలాండ్‌కు చెందిన ఓ వెబ్సైట్లో మోటరోలా ఎడ్జ్ 70 డిజైన్, కలర్స్, […]
Jubilee Hills By Election: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం (ECI) అధికారిక నోటిఫికేషన్‌ను నేడు (అక్టోబర్ 13) విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఇందుకోసం పార్టీలు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు […]