SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
- ఐపీఎల్ 2026 సీజన్లో యువ బ్యాటర్ల హవా
- బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అభిషేక్-వైభవ్
- ఎలిమినేటర్‌లో అందరికళ్లు ఆ ఇద్దరి పైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi and Abhishek Sharma Stats in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. పవర్ హిట్టింగ్, అద్భుతమైన స్ట్రైక్‌రేట్లు, భారీ ఇన్నింగ్స్‌లతో ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఇద్దరి గణాంకాలు చూసిన తర్వాత ఈరోజు ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరుగుల వరద ఎంతలా ఉండబోతోందో అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 563 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 135 నాటౌట్. 43.30 సగటుతో పాటు 196.85 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే.. అభిషేక్ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సీజన్లో 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ బాదాడు. ఒకసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచిన అభి.. రెండు సార్లు డక్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం అభిషేక్‌ను ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుత గణాంకాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 583 పరుగులు బాదాడు. అతడి అత్యధిక స్కోర్ 103. 213.55 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సీజన్లో వైభవ్ మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. బుడ్డోడు ఒక్కసారి మాత్రమే డక్ అవుట్ అయ్యాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయడం వైభవ్ ప్రత్యేకతగా మారింది.
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ ఈ సీజన్లో 500కు పైగా పరుగులు చేయడంతో పాటు 190కి పైగా స్ట్రైక్‌రేట్‌తో రాణించడం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు పెద్ద పాజిటివ్‌గా మారింది. దూకుడుగా ఆడే ఈ ఇద్దరు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారారు. ఈ కీలక సమరంలో వైభవ్, అభిని బౌలర్లు ఎంత మేరకు కట్టడి చేయగలరన్న దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఆర్చర్ vs అభిషేక్, వైభవ్ vs కమిన్స్ పోరు ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవలి మ్యాచ్‌లలో సన్‌రైజర్సే పైచేయిగా ఉంది.
తాజావార్తలు
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
-
Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
-
Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
-
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!