12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
- కొత్త HONOR Pad 20 టాబ్లెట్‌ను లాంచ్
- ఈ టాబ్లెట్ స్టాండర్డ్, సాఫ్ట్ లైట్, లింగ్యుయే ఎడిషన్లలో అందుబాటులో
- 12.1 అంగుళాల 3K TFT LCD IPS డిస్ప్లే
- 10,100mAh భారీ బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 6 స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లతో మెరుగైన ఆడియో అనుభవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Pad 20 Launched: హానర్ (HONOR) చైనాలో కొత్త టాబ్లెట్ హానర్ ప్యాడ్ 20 (HONOR Pad 20) ను లాంచ్ చేసింది. HONOR 600 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు ఈ టాబ్లెట్‌ను కూడా కంపెనీ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ ఎడిషన్, సాఫ్ట్ లైట్ ఎడిషన్, లింగ్యుయే ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో ఈ టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ టాబ్లెట్ ఎక్స్ట్రార్డినరీ గ్రే, ఫారెస్ట్ గ్రీన్, డేజ్లింగ్ పింక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
డిజైన్ పరంగా చిన్న రౌండ్ కెమెరా మాడ్యూల్తో స్లిమ్ లుక్‌ను కలిగి ఉంది ఈ కొత్త ట్యాబ్. కేవలం 6.29mm మందంతో, 525 గ్రాముల బరువుతో ఈ టాబ్లెట్ చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇంకా ఇందులో 12.1 అంగుళాల 3K TFT LCD IPS డిస్ప్లే ఉండగా.. ఇది 3000 x 1872 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్‌లో “ఫుల్ కలర్ పేపర్ లైక్ స్క్రీన్” టెక్నాలజీని ఉపయోగించారు. ఇది పేపర్‌పై రాస్తున్న అనుభూతిని కలిగించేలా ఉంటుంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ టాబ్లెట్‌లో Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌ను అమర్చారు. 4nm టెక్నాలజీపై రూపొందించిన ఈ ప్రాసెసర్‌తో మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు స్మూత్‌గా చేయవచ్చు. ఇది 6GB/8GB/12GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0 పై పనిచేస్తుంది.

ఇందులో 10,100mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 66W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. ఇంకా ఆడియో కోసం ఇందులో 6 స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఇచ్చారు. దీంతో సినిమాలు, మ్యూజిక్, వీడియో కాల్స్ సమయంలో మెరుగైన సౌండ్ అనుభవం లభిస్తుంది. ఈ టాబ్లెట్ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది “క్రాస్ ప్లాట్‌ఫామ్ కనెక్టివిటీ”. HONOR ఎకోసిస్టమ్కే పరిమితం కాకుండా iOS, HarmonyOS, ఆండ్రాయిడ్ డివైస్లతో కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. Apple AirPodsతో క్విక్ పెయిరింగ్, ఐఫోన్ లతో ఫైల్ ట్రాన్స్ఫర్, Mac కంప్యూటర్లతో కోలాబరేటివ్ ఎడిటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హానర్ ఫోన్లతో వన్‌టచ్ ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ టాబ్లెట్‌లో 8MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కనెక్టివిటీ కోసం Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైపు-C పోర్ట్, OTG సపోర్ట్ ఉన్నాయి.
ధరలు వివరాలు ఇలా:
* 6GB + 128GB – 2099 యువాన్ (రూ. 29,400)
* 8GB + 128GB – 2299 యువాన్ (రూ. 32,200)
* 8GB + 128GB సాఫ్ట్ లైట్ ఎడిషన్ – 2499 యువాన్ (రూ. 35,000)
* 8GB + 256GB – 2699 యువాన్ (రూ. 37,800)
* 8GB + 256GB సాఫ్ట్ లైట్ ఎడిషన్ – 2999 యువాన్ (రూ. 42,000)
* 12GB + 256GB సాఫ్ట్ లైట్ ఎడిషన్ – 3399 యువాన్ (రూ. 47,600)
ఈ టాబ్లెట్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, మే 27 నుంచి అధికారికంగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..