Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raw Mango Roti Pachadi: మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలామంది ఇళ్లలో ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడే. ముఖ్యంగా రోట్లో దంచిన మామిడికాయ రోటి పచ్చడికి ఉన్న రుచి మాటల్లో చెప్పలేం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. చాలా తక్కువ సమయంలో సింపుల్‌గా చేసుకునే ఈ రోటి పచ్చడి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మరి ఈ కమ్మటి మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* పచ్చి మామిడికాయలు – 2
* మెంతులు – ¼ టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* ఆవాలు – 1 టీ స్పూన్
* కల్లుపుడి/ఉప్పు – తగినంత
* వెల్లుల్లి రెబ్బలు – 10
* కారం – 2 టేబుల్ స్పూన్లు
* పసుపు – ¼ టీ స్పూన్
* నూనె – టేబుల్ స్పూన్లు
* పచ్చిశనగపప్పు – ½ టీ స్పూన్
* మినప్పప్పు – ½ టీ స్పూన్
* ఇంగువ – ¼ టీ స్పూన్
* ఎండుమిర్చి – 4
* కరివేపాకు – కొద్దిగా
Also Read
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
తయారీ విధానం:
మామిడికాయ ముక్కలు సిద్ధం:
ముందుగా మామిడికాయలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్క తీసేయకుండా కట్ చేస్తే పచ్చడికి మంచి టెక్స్చర్ వస్తుంది. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.
మసాలా దినుసులు వేయించడం:
స్టవ్‌పై కడాయి పెట్టి ముందుగా మెంతులను కొద్దిగా వేయించాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఇవన్నీ చల్లారాక రోట్లో లేదా మిక్సీలో వేసి ఉప్పుతో కలిసి మెత్తగా పొడిలా దంచుకోవాలి.
పచ్చడి దంచడం:
ఇప్పుడు రోట్లో వెల్లుల్లి రెబ్బలు, కొద్దికొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ దంచాలి. మధ్యలో కారం, పసుపు వేసి మరికొన్ని ముక్కలు జత చేస్తూ దంచుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది. పచ్చడి మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పలుకులు కనిపించేలా దంచితే రుచి మరింత బాగుంటుంది.
పోపు పెట్టడం:
కడాయిలో నూనె వేసి వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పోపులో ముందుగా దంచిన మామిడికాయ ముద్దను వేసి కలపాలి. అలాగే తయారుచేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా జత చేసి బాగా కలపాలి. చివరగా రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసి మరోసారి కలిపితే రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి రెడీ.
ఈ పచ్చడిని బయట ఉంచితే నాలుగు నుంచి ఐదు రోజుల వరకు బాగానే ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే వెంటనే తినాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేసి దంచుకోవచ్చు. కాబట్టి ఈ మామిడికాయ సీజన్లో మీరు కూడా ఒకసారి ఈ పుల్లటి కమ్మటి రోటి పచ్చడిని ట్రై చేసి చూడండి. వేడి అన్నంలోకి ఇది నిజంగా అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!