స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Reno16 Series Launched: ఒప్పో (OPPO) సంస్థ కొత్త OPPO Reno16 సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో OPPO Reno16, OPPO Reno16 Pro మోడళ్లను తీసుకవచ్చింది. ఈ సిరీస్‌లో గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో పాటు మెటల్ ఫ్రేమ్‌ను ఉపయోగించింది. రెనో16లో 6.32 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లే ఉండగా, రెనో16 ప్రోలో పెద్ద 6.78 అంగుళాల OLED స్క్రీన్‌ను అందించారు. రెండు ఫోన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. “స్టారి నైట్” వేరియంట్లో ప్రత్యేక 3D ఐస్ క్లియర్ ఫ్లోటింగ్ డిజైన్‌ను తీసుకవచ్చారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెనో16లో MediaTek Dimensity 8550 సూపర్ ప్రాసెసర్ ఉండగా, Reno16 Proలో మరింత శక్తివంతమైన డిమెంసిటీ 9500s 3nm చిప్‌సెట్‌ను కంపెనీ అందించింది. రెండు ఫోన్లలోనూ LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. వితోపాటు ప్రత్యేక ShanHai కమ్యూనికేషన్ చిప్, Wi-Fi యాక్సిలరేషన్ చిప్, నానో ఐస్ క్రిస్టల్ కూలింగ్ సిస్టమ్ వంటి టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
కెమెరా విభాగంలో Reno16 సిరీస్ రెండు ఫోన్లలోనూ 200MP ప్రధాన కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇవి 4K 60fps వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. AI ఫీచర్లపై కూడా ఒప్పో ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రత్యేక AI బటన్‌ను అందించారు. దీని ద్వారా AI వన్-క్లిక్ నోట్స్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇది స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని నోట్స్‌గా సేవ్ చేయడం, ట్రావెల్ ప్లాన్స్ రూపొందించడం, స్టడీ నోట్స్ తయారు చేయడం వంటి పనులను సులభతరం చేస్తుంది.

బ్యాటరీ విషయంలో Reno16లో 6700mAh బ్యాటరీ ఉండగా, Reno16 ప్రోలో 7000mAh బ్యాటరీని అందించారు. రెండు ఫోన్లూ 80W సూపర్ VOOC ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి. అలాగే Pro మోడల్లో 50W AIRVOOC వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంది. ఇవి IP66, IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వస్తున్నాయి. స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ధరల విషయానికి వస్తే ఒప్పో రెనో16 ప్రారంభ ధర 3499 యువాన్ కాగా, Reno16 Pro ప్రారంభ ధర 4499 యువాన్‌గా నిర్ణయించారు. OPPO బబుల్ అనే కొత్త సెల్ఫీ యాక్సెసరీని కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. మే 29 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?