200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
- HONOR 600 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్
- ఈ సిరీస్‌లో HONOR 600, HONOR 600 Pro, HONOR 600 Vitality Edition మోడళ్లు..
- IP68, IP69, IP69K వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR 600 Series Launched: HONOR 600 సిరీస్‌ను చైనా మార్కెట్లో హానర్ లాంచ్ చేసింది. ఇందులో HONOR 600, HONOR 600 Pro మోడళ్లతో పాటు HONOR 600 విటాలిటీ ఎడిషన్ కూడా ఉన్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ఫోన్లు ఇప్పుడు చైనాలో కొన్ని అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లతో లాంచ్ అయ్యాయి. హానర్ 600, హానర్ 600 ప్రో ఫోన్లలో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు ఉన్నపటికీ.. డిస్ప్లే & కెమెరా ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి.
హానర్ 600లో Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉండగా, HONOR 600 Proలో కొత్త మీడియాటెక్ డిమెంసిటీ 8550 ఎలైట్ చిప్‌సెట్‌ను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ఫోన్లలో 6.57 అంగుళాల 1.5K OLED డిస్ప్లేను కంపెనీ అందించింది. 120Hz రిఫ్రెష్ రేట్, 8000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, DCI-P3 కలర్ గామట్ వంటి ఫీచర్లు వీటికి ప్రత్యేకతను జోడిస్తున్నాయి.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఫోటోగ్రఫీ విషయంలో కూడా హానర్ ఈసారి భారీ అప్‌గ్రేడ్ చేసింది. రెండు ఫోన్లలోనూ 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాలను అందించింది. హానర్ 600 ప్రోలో అదనంగా 50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్‌ను అందించారు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది. బ్యాటరీ విషయంలో HONOR 600 సిరీస్ నిజంగా సంచలనం సృష్టించింది. HONOR 600లో 8600mAh భారీ బ్యాటరీని కంపెనీ అందించగా, HONOR 600 Proలో 8000mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్లూ 80W SuperCharge ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ప్రో మోడల్లో 50W వైర్లెస్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.
ఇవి IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తున్నాయి. స్టీరియో స్పీకర్లు, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, NFC, Wi-Fi 6, 5G వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ధరల విషయానికి వస్తే HONOR 600 ప్రారంభ ధర 3299 యువాన్ కాగా, HONOR 600 Pro ప్రారంభ ధర 3899 యువాన్‌గా నిర్ణయించారు. HONOR 600 విటాలిటీ ఎడిషన్ ధర 2699 యువాన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. HONOR 600, 600 Pro మే 29 నుంచి.. విటాలిటీ ఎడిషన్ జూన్ 3 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?