Happy Birthday Sarfaraz Khan: భారత జట్టు స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోమవారం రాత్రి తండ్రి అయ్యాడు. భార్య రొమానా 21 అక్టోబర్ 2024 రాత్రి కొడుకుకు జన్మనిచ్చింది. తన 26వ పుట్టినరోజుకు ముందు, సర్ఫరాజ్ ఖాన్ కొడుకు రూపంలో ఒక అందమైన బహుమతిని అందుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్త అందించాడు. దాంతో అభిమానులు ఇప్పుడు అతనికి డబుల్ అభినందనలు చెబుతున్నారు. రెండు గంటలు గడిస్తే పుట్టినరోజును జరుపుకొనేందుకు […]
Bulandshahr Cylinder Blast: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద పడి మృతి చెందారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసు పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు […]
Kejriwal: అతి త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన భార్యతో కలిసి మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. తన ప్రయాణం గురించి సమాచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా అందించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా మాతా వైష్ణోదేవిని దర్శించుకోనున్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ స్కామ్ ఆరోపణలపై జైలు నుంచి విడుదలైన […]
Ganderbal Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మెస్‌లో భోజనం చేస్తున్న కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ డాక్టర్‌తో సహా ఏడుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడిపై తాజాగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా […]
Naga Chaitanya Shobita Weeding: త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల జంటకు సంబంధించి పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి పనులకు సంబంధించిన పనులు మొదలైనట్లుగా శోభిత కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శోభిత ఈ ఫోటోలను పంచుకుంటూ గోధుమ రాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలైనట్లు తెలిపింది. వైజాగ్ లోని శోభిత స్వగృహంలో కార్యక్రమం […]
Virat Kohli and Anushka Sharma at Krishna Das Kirtan in Mumbai: ఆదివారం బెంగళూరు టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. విరాట్ ఇక్కడకు చేరుకున్న వెంటనే.. అతను తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ‘కర్వా చౌత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జంట కీర్తన కార్యక్రమానికి హాజరై భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. కృష్ణదాస్ […]
Farooq Abdullah says Kashmir will never become Pakistan: జమ్మూ కాశ్మీర్‌లోని గందర్బల్లో ఉగ్రదాడి తర్వాత, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కాశ్మీర్ పాకిస్థాన్‌గా మారదని పాక్ పాలకులకు చెప్పాలనుకుంటున్నామని ఆయన సోమవారం అన్నారు. ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ క్రూరమైన వ్యక్తులు దీని నుండి ఏమి పొందుతారు? దీని వల్ల ఇక్కడ పాకిస్తాన్‌ను సృష్టిస్తుందని వారు భావిస్తున్నారా? నిజంగా భారత్‌తో […]
Archery World Cup 2024 DEEPIKA KUMARI Won Silver medal: మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో చైనాకు చెందిన లీ జియామెన్ చేతిలో 0-6 తేడాతో ఓడిపోయిన తర్వాత భారత టాప్ రికర్వ్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకాన్ని గెలుచుకుంది. సెమీఫైనల్స్ వరకు ఆమె మంచి ప్రదర్శన కనబరిచింది. కానీ, పారిస్ ఒలింపిక్స్ జట్టు రజత పతక విజేత నాల్గవ సీడ్ లీ జియామెన్ పై జరిగిన బంగారు పతకం మ్యాచ్ లో […]
Charles III: బ్రిటీష్ రాజు చార్లెస్ III కు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఘోర అవమానానికి గురయ్యాడు. బ్రిటన్ దేశ అధికారిక పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అలా తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే, స్థానిక ఆదిమ సెనేటర్ లిడియా థోర్ప్ రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మా ప్రాంతాన్ని మాకు వెనక్కి ఇవ్వండి. మీరు మా నుండి దోచుకున్నదంతా తిరిగి ఇవ్వండి. ఇది మీ దేశం కాదు. నువ్వు మా రాజువి కాదు. యూరోపియన్ […]
Hug Time: న్యూజిలాండ్‌లోని డునెడిన్ విమానాశ్రయంలో డ్రాప్-ఆఫ్ జోన్లో వీడ్కోలు కౌగిలింతలపై సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇది తుది ఆలింగనానికి కేవలం మూడు నిమిషాల సమయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. విమానాశ్రయం వద్ద ఒక సైన్‌బోర్డులో “గరిష్టంగా కౌగిలించుకునే సమయం 3 నిమిషాలు అని, ఇష్టపడే వీడ్కోలు కోసం దయచేసి కార్ పార్క్‌ని ఉపయోగించండి” అని సూచిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు దారి తీస్తోంది. Read Also: Khalistani Terrorist: నవంబర్ 19 […]