Charles III: బ్రిటీష్ రాజు చార్లెస్ III కు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానానికి గురయ్యాడు. బ్రిటన్ దేశ అధికారిక పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అలా తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే, స్థానిక ఆదిమ సెనేటర్ లిడియా థోర్ప్ రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మా ప్రాంతాన్ని మాకు వెనక్కి ఇవ్వండి. మీరు మా నుండి దోచుకున్నదంతా తిరిగి ఇవ్వండి. ఇది మీ దేశం కాదు. నువ్వు మా రాజువి కాదు. యూరోపియన్ వలసదారులు స్థానిక ఆస్ట్రేలియన్లపై మారణహోమానికి పాల్పడ్డారు” అంటూ దాదాపు ఒక నిమిషం పాటు బిగ్గరగా అరిచింది.
Read Also: CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
ఇకపోతే, 2022లో కూడా థోర్ డ్యూర్పే ప్రమాణ స్వీకారం సమయంలో కూడా క్వీన్ ఎలిజబెత్ II కూడా వలస రాజ్యపాలకురాలంటూ అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు హౌస్ ప్రెసిడెంట్ సూ లిన్స్ ఆమెను సరిదిద్దారు. “సెనేటర్ థోర్ప్, మీరు అఫిడవిట్‌లో వ్రాసిన వాటిని మాత్రమే చదవాలి అంటూ పేర్కొన్నారు. నిజానికి భారతదేశం లాగే ఆస్ట్రేలియా కూడా చాలా సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పరిపాలన ఉండేది. ఈ సమయంలో, వేలాది మంది ఆస్ట్రేలియన్ ఆదిమవాసులు చంపబడ్డారు. ఆ తర్వాత దేశం 1901లో అప్రకటిత స్వాతంత్య్రాన్ని పొందింది. అయినప్పటికీ, పూర్తి స్థాయి గణతంత్రం పొందలేదు.
Read Also: Hug Time: ఎయిర్‌పోర్టులో వింత నిబంధన.. వీడ్కోలు కౌగిలింతకు కూడా టైం లిమిట్