Happy Birthday Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్
- సర్పరాజ్ కు డబుల్ ధమాకా..
- పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్.
- పుట్టిన రోజుకు 2 గంటల ముందు తండ్రి అయ్యాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Happy Birthday Sarfaraz Khan: భారత జట్టు స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోమవారం రాత్రి తండ్రి అయ్యాడు. భార్య రొమానా 21 అక్టోబర్ 2024 రాత్రి కొడుకుకు జన్మనిచ్చింది. తన 26వ పుట్టినరోజుకు ముందు, సర్ఫరాజ్ ఖాన్ కొడుకు రూపంలో ఒక అందమైన బహుమతిని అందుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్త అందించాడు. దాంతో అభిమానులు ఇప్పుడు అతనికి డబుల్ అభినందనలు చెబుతున్నారు. రెండు గంటలు గడిస్తే పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధంగా ఉన్న సర్పరాజ్ కు ఊహించని గిఫ్ట్ కొడుకు రూపంలో అందుకున్నాడు.
Read Also: Cylinder Blast: సిలిండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. ఆరుగురు మృతి
Also Read
ఇకపోతే, సర్ఫరాజ్ ఖాన్ 22 అక్టోబర్ 1997న ముంబైలో జన్మించాడు. సర్ఫరాజ్ ఖాన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తితో అంచలంచలుగా ఎదిగి చివరికి టీమిండియా తరపున ఆడుతున్నాడు. 2015లో RCB అతనిని తమ క్యాంపులో చేర్చుకుంది. సర్ఫరాజ్ ఫిబ్రవరి 15న రాజ్‌కోట్ మైదానంలో అరంగేట్రం చేసి ప్రత్యేక మైలురాయిని కూడా సాధించాడు. తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లోనే, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అతను రనౌట్ అయ్యాడు. దీని తర్వాత, అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా 68 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ క్రికెట్ కెరీర్‌లో టీమిండియా తరుపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 58 సగటుతో 350 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 150. ఇందులో 3 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా చేశాడు.
Read Also: Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!