Srinivasa Varma: ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తణుకు మున్సిపాలిటీలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తించడమంటూ.. నరికేస్తాం, చంపేస్తాం.. అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. టిడిఆర్ బాండ్ల విషయమై కారుమూరి […]
Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఈవో రామ్ చంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సదుపాయాల లోపం కనిపించడంతో ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఏఈఓ చంద్రశేఖర్‌ను క్లూ లైన్ల పరిశీలన సమయంలో కనిపించకపోవడంతో ఆయనకు చార్జ్ మెమో జారీ చేశారు. అంతేకాదు, అంతరాలయం ఎదుట ఉన్న హుండీని తొలగించాల్సిందిగా రెండుసార్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఈవో తప్పుబట్టారు. […]
MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ కేపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక మ్యాచ్ టాస్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్బంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో టాస్ గెలిచి మేమే నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ప్రత్యర్థి నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్న అనుభూతి […]
Anna Konidela: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం ఆమె రేణిగుంట విమానాశ్రయం ద్వారా తిరుపతి చేరుకున్నారు. శ్రీమతి అనా కొణిదల రేపు (సోమవారం) వేకువజామున తిరుమలలో జరిగే సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం ఆమె స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తమ కుమారుడు మార్క్ శంకర్ […]
RR vs RCB: జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 17.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ […]
AB Venkateswara Rao: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.., “నాకు ఈరోజు లిఫ్ లాగా ఉంది. నా జీవితంలో కాళ్లు చేతులు ఆడినంతకాలం సమాజం కోసం పనిచేస్తాను” అంటూ తన ఆలోచనని ప్రకటించారు. మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆయన అన్నారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం, సమాజం కోసం పనిచేస్తానని స్పష్టంగా […]
Pawan Kalyan:అనకాపల్లి జిల్లా కోటవురట్ల దగ్గర బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున భారీ పేలుడు మూలంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. ఘటన వివరాలు, బాధితుల పరిస్థితి గురించి ఆమె తెలిపారని, అధికార యంత్రాంగం సత్వరమే స్పందించిందని […]
RR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగుల స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి […]
Perni Nani: మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పాల్గొన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో 11 మంది పోలీస్ లను సస్పెండ్ చేయడం చూస్తే కూటమి పాలన అర్థం అవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలిసులు ఈ చర్యలు గుర్తించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను వాడుకొని వదిలేయడం సర్వసాధారణమని.. ఎస్సై, సిఐలు గమనించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఎవరినైనా ఎర వేస్తాడు, ఎవరినైనా బలిచేస్తాడని ఘాటు […]