KTR: తెలంగాణ భవన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఆలోచన నాయకత్వం వల్లే మనకు ఈరోజు తెలంగాణ లభించింది. అంబేద్కర్ కారణంగానే మనకు అత్యుత్తమ రాజ్యాంగం లభించిందని […]
Telangana SC Classification: తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. మూడు గ్రూపులుగా విభజన, రిజర్వేషన్ల కేటాయింపు […]
Fire Safety Week: తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వట్టినాగులపల్లిలో ఉన్న అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రంలో ముఖ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫైర్ డిపార్ట్మెంట్కు చెందిన అమరవీరుల స్తూపం […]
Coal Mines: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం బొగ్గు గనుల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ వర్షం ప్రభావంతో జే.వి.ఆర్. ఓసి (JVROC), కిష్టారం ఓసి (Kishtaram OC)లల్లో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. వరద నీరు గనుల్లోకి చేరడంతో మట్టి వెలికితీతతో పాటు బొగ్గు తవ్వకాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. జేవిఆర్ ఓసి గనిలో రోజుకు సగటున 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే సుమారు 50,000 క్యూబిక్ మీటర్ల […]
Mancherial: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు మంచిర్యాల జిల్లాను సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఈ ఐదుగురు నేతలు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి బృందం బయలుదేరి, ఉదయం 11 గంటలకు మంచిర్యాలకు […]
Falaknuma: హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా ప్రాంతంలో దారుణ హత్య కలకలం రేపింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ హత్య ఘటనకు సంబంధించిన సమాచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇకపోతే, మాస్ యుద్దీన్ మూడురోజుల క్రితమే వివాహితుడయ్యాడు. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడిని అకాల మరణం కలవరిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గుర్తుతెలియని దుండగులు మాస్ యుద్దీన్పై కత్తులతో దాడి చేసి అతన్ని అక్కడికక్కడే […]
SC Categorization: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ వర్గీకరణ అమలుకు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఎంపిక చేసుకోవడం విశేషం. గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలంగా, ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో […]
Anna Lezhneva Konidela: సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల నేడు మొదట తిరుమలలోని గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు. టీటీడీ నియమాల ప్రకారం.. అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే వారు శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి […]
MI vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (ఏప్రిల్ 13) న ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో… ప్రారంభంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 18 పరుగులు చేసి త్వరగా వెనుదిరిగినప్పటికీ, ర్యాన్ రికెల్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 […]
Weather Report: ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ నేడు (ఆదివారం) ఒక ప్రకటనలో భాగంగా.. సోమవారం (ఏప్రిల్ 14) రోజున రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు (11) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. […]