Pawan Kalyan:అనకాపల్లి జిల్లా కోటవురట్ల దగ్గర బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున భారీ పేలుడు మూలంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. ఘటన వివరాలు, బాధితుల పరిస్థితి గురించి ఆమె తెలిపారని, అధికార యంత్రాంగం సత్వరమే స్పందించిందని ఆయన అన్నారు.
RR vs RCB: తడబడి నిలదొక్కుకున్న రాజస్థాన్ రాయల్స్.. హాఫ్ సెంచరీతో ఆదుకున్న జైస్వాల్
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని ఆయన తెలిపారు. కొద్ది రోజుల కిందట అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో విశాఖలో భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల్లో పర్యావరణ సంబంధిత అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలతోపాటు భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలని భావించానని, కాకపోతే అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీని తర్వాత విశాఖ పర్యటనలో ఈ అంశంపై దృష్టిపెడతానని తెలిపారు.