Auto Drivers Protest: ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. ఫ్రీ బస్సు పథకం తీసుకు రావడంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ. 11000 ఆటో డ్రైవర్లకు అందిస్తామని రెండేళ్లైన ఇవ్వలేదని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ఆటో యూనియన్ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: GROK: గీత దాటిన గ్రోక్.. ఇది స్వేచ్ఛ కాదు.. విచ్చలవిడితనం..! చిన్నపిల్లల దుస్తులను తీసేసి..
ఇక, ఆటో యూనియన్ కార్మికుల ముట్టడి పిలుపుతో అసెంబ్లీ బయట పోలీసులు భారీగా మొహరించారు. అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందన్న ఎలాంటి నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. అసెంబ్లీ వద్ద ఎలాంటి నిరసన చేయొద్దని సూచించారు.