ఆర్ఎస్ఎస్ ఏ రాజకీయ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదని.. సమాజాన్ని నిర్మించే ఒక సంస్థ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని రవీంద్ర భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హిందూత్వం, భాష-సంస్థాగత విస్తరణ, ఆర్ఎస్ఎస్-బీజేపీ సంబంధాలపై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ లేదా విశ్వహిందూ పరిషత్ కోణంలో చూడొద్దన్నారు. హిందువులను శాంతియుతంగా సంఘటితం చేసేందుకే సంఘ్ స్థాపించబడిందని చెప్పారు. హిందూ మతం ఒక కులం కాదని.. అన్ని వర్గాలు.. మతాలను గౌరవించే వైఖరి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంఘ్‌లో 6 మిలియన్ల మంది స్వచ్ఛందంగా సేవకులుగా ఉన్నారని.. దేశంలో హిందువులుగా గుర్తించే వారి సంఖ్య దాదాపు 1 బిలియన్ మాత్రమే అని చెప్పారు. పట్టణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలను ఆర్ఎస్ఎస్ చేరుకోలేకపోయిందని వెల్లడించారు.
ఇక మూడు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర భాష, జాతీయ భాష, ప్రపంచ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక హిందూత్వం ఒక కులం కాదని.. మనస్తత్వం అని అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
తమ సంస్థ చాలా కాలంగా తప్పుడు సమాచారం, అపార్థాలకు గురవతోందన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదే జరుగుతోందని తెలిపారు. వ్యతిరేకించే వారితో పాటు విమర్శించేవారి దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మొత్తం ప్రపంచానికి ఆర్ఎస్ఎస్ గురించి తెలుసు.. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే సంస్థ ఉద్దేశం పూర్తిగా తెలుసు అన్నారు. ఆర్ఎస్ఎస్‌కు సమాంతరంగా మరొక సంస్థ లేదని పేర్కొన్నారు. ఈ సంస్థ పని తీరు చాలా ప్రత్యేకమైందని.. గౌతమ బుద్ధుడు నుంచి ప్రేరణ పొందిన సంస్థగా అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ సేవకులు లాఠీలు పట్టుకున్నంత మాత్రాన పారామిలిటరీ దళంగా తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడు కథనాలు వ్యప్తి చేయొద్దని కోరారు. ఆర్ఎస్ఎస్ గురించి వికీపీడియాలో శోధించే కంటే.. నేరుగా ఆర్ఎస్ఎస్‌తో కలిసుంటే సంస్థ ఉద్దేశం తెలుస్తుందన్నారు. ఇక స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: ముందస్తు ముచ్చట.. పట్టుదలగా మంత్రి తుమ్మల?