Perni Nani: మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పాల్గొన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో 11 మంది పోలీస్ లను సస్పెండ్ చేయడం చూస్తే కూటమి పాలన అర్థం అవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలిసులు ఈ చర్యలు గుర్తించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను వాడుకొని వదిలేయడం సర్వసాధారణమని.. ఎస్సై, సిఐలు గమనించాలని ఆయన అన్నారు.
చంద్రబాబు ఎవరినైనా ఎర వేస్తాడు, ఎవరినైనా బలిచేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు. అధికారి, బంధువు, పోలీస్, కార్యకర్త ఇలా ఎవరైనా చంద్రబాబుకి ఒకటే. కార్యకర్తను మెప్పించడానికి 11 మందికి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి? రెడ్ బుక్ చూసో, లోకేష్ మాటలను చూసో చంద్రబాబు మాటలను చూసో ఓవరాక్షన్ చేసేవారు ఉన్నారని ఆయన అన్నారు. దొంగ కేసులు పెట్టడం కొట్టడం తిట్టడం, చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండని ఆయన అన్నారు. ఈ తండ్రి కొడుకులను, పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే మీకు ఏ గతి పడుతుందో మనకు పోలీస్ లను చూస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు.
మీరు హుందా తనం మర్చిపోయి.. రెడ్ బుక్ రచయిత లోకేష్ ను చూసుకొని , అడ్రస్ తెలియని పవన్ కళ్యాణ్ చూసుకొని మీరు రెచ్చిపోతే తిప్పలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలు మీరు జెండాలు మోయండి తప్పులేదు.. పార్టీకి పనిచేయండి. కానీ, మీకు విలువ లేదు, దిక్కులేదని అన్నారు. ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో వారు ఉన్నారని.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా దోచుకునే పనిలో వారు ఉన్నారని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు.