MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ కేపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక మ్యాచ్ టాస్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్బంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో టాస్ గెలిచి మేమే నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ప్రత్యర్థి నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్న అనుభూతి కలుగుతోందని అన్నాడు. మేము మంచి స్కోరు చేయాలని ఆశిస్తున్నాం. జట్టులో అందరం గత తప్పులను గుర్తించి మెరుగుదల కోసం కృషి చేస్తున్నామని.. ఎటువంటి భయం లేకుండా శాంతంగా వ్యవహరిస్తూ ఒకరిని ఒకరు మద్దతుగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.
ఇక మరో వైపు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. మేము చేజింగ్‌లో విజయవంతంగా ఆడుతున్నాం. ఈ పిచ్ ఎలా ఉంటుందో తెలియకపోయినా, చేజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. జట్టు గత రికార్డులపై కాకుండా ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మేము వైజాగ్ లో చిన్న గ్రౌండ్‌లో ఆడాం.. ఇక్కడ ఢిల్లీ కూడా అలానే ఉంటుంది. ధైర్యంగా ఆడాలి. హోం గ్రౌండ్‌లో మద్దతు బాగా ఉంటుంది. ఫాఫ్ డుప్లెసిస్ గాయపడగా.. అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఆఖరుకి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇలా ఉన్నాయి.
ముంబయి ఇండియన్స్ (MI):
రోహిత్ శర్మ, రాయన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నామన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ముంబయి ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: కర్ణ్ శర్మ, కొర్బిన్ బోష్, అశ్వనీ కుమార్, రాజ్ బావా, రాబిన్ మిన్జ్
ఢిల్లీ కేపిటల్స్ (DC):
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ
ఢిల్లీ కేపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, దర్శన్ నల్కండే, డొనోవన్ ఫెరెయా, దుష్మంత చమీరా.