T20 World Cup: బ్రిస్బేన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షం గబ్బా మైదానాన్ని ముంచెత్తడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మెగా టోర్నీకి ముందు టీమిండియాకు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను కేటాయించగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో […]
Rahul Gandhi: ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని.. అది అమరావతి మాత్రమే ఉండాలని తన అభిప్రాయంగా రాహుల్ గాంధీ తెలియజేశారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌పై […]
CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసే ముందు బీజేపీ విషయంలో క్లారిటీ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ విషయంలో క్లారిటీ ఇస్తే.. పవన్, చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఏ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌కు లేనన్ని శాఖలను విజయసాయిరెడ్డికి అప్పజెప్పారని.. వైసీపీని మోదీ- అమిత్ […]
ISRO: ఈనెల 23వ తేదీ భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో రికార్డు స్థాయిలో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బ్రిటిష్ స్టార్టప్ ‘వన్ వెబ్’ సంస్థకు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధం అవుతోంది. ఏపీలోని శ్రీహరికోట షార్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రయోగం జరగనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3ని […]
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదుటపడిన పిమ్మట సీఎస్ సమీర్ […]
Karumuri Nageswararao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పవన్ కళ్యాణ్ కాల్షీట్ ముగిసిందని.. అందుకే హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని.. మంత్రి రోజా వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి […]
State Bank Of India: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఆయా పోస్టుల్లో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 7 వరకు ఆయా ఉద్యోగాలకు అభ్యర్థులు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ […]
Cricket: ఆసియా కప్ 2023 విషయంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం నెలకొంది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై ఒత్తిడి తెస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అయితే పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌ను ఇండియా బాయ్‌కాట్ చేస్తే.. వచ్చే ఏడాది ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను తాము బాయ్‌కాట్ చేస్తామని […]
Bigg Boss 6: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ చప్పగా కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో వరస్ట్ కంటెస్టెంట్లు మీరే అని మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అందరికీ అక్షింతలు వేశాడు. స్కిట్లు సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డాడు. అయితే ఈ సీజన్‌లో అంతో కొంతో హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటే అది గీతూ రాయల్ వల్లే. తొలుత ఆమె వాయిస్ విని ప్రేక్షకులకు విసుగుపుట్టినా క్రమంగా గీతూ వాయిస్, ఆమె యాస, మాటలు, చేష్టలకు […]
Chess Championship: ఇటలీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో ఆడుతున్న విజయవాడ గ్రాండ్‌మాస్టర్ నూతక్కి ప్రియాంక టోర్నీ నుంచి బహిష్కరణకు గురైంది. ఈ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌కు ప్రియాంక పొరపాటున తన జేబులో మొబైల్ ఇయర్ బడ్స్‌తో వచ్చింది. చెకింగ్‌లో ఆమె జాకెట్‌లో ఇయర్ బడ్స్ బయటపడటంతో ఆటను రద్దు చేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఫౌల్ గేమ్ ఆడనప్పటికీ […]