Ram Charan: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రామ్‌చరణ్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా చెర్రీ నిలిచాడు. ప్రస్తుతం అతడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో అమాంతం పెరిగిన చెర్రీ క్రేజ్ శంకర్ […]
Bigg Boss 6: బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గేమ్‌తో పాటు ఎమోషన్, రిలేషన్ కూడా ఉంటుంది. అయితే తెలుగులో ప్రసారమవుతున్న సీజన్ 6 చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అందరూ ఎవరికి వారే తోపులా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌లో కొంచెం బలంగా కనిపిస్తున్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, శ్రీసత్య విషయంలో నేనే తోపురా అనే డైలాగ్ వినిపిస్తోంది. గతంలో ప్రసారమైన ఐదు సీజన్‌లలో రిలేషన్ […]
Astrology: ఈ రోజు రాశిఫలాలు ఎలా వున్నాయి? ద్వాదశ రాశుల వారు ఏం చేయాలి? ఏం చేయకూడదు? దైవ కృప కోసం ఎలాంటి పూజలు చేయాలి.. శ్రీ రాయప్రోలు మల్లిఖార్జున శర్మ అందించే దినఫలాలు మీకోసం.. ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=D0xjBkXBfWI&ab_channel=BhakthiTV
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 21 వరకు నాలుగు రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ […]
What’s Today: • ఢిల్లీ: నేడు ఉదయం 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. కేబినెట్‌తో పాటు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ • నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఏపీలో 119 కి.మీ పాటు సాగనున్న రాహుల్ పాదయాత్ర.. ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ • అమరావతి: నేడు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో […]
Vallabhaneni Vamsi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకుని ఈదాలనుకుంటున్నారని.. పవన్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ విధించిన 187 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది. టీమిండియా బౌలర్ షమీ ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక్కడే రాణించాడు. ఫించ్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 […]
CM Jagan: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు, […]
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా విశాఖ పర్యటనలోనే ఉన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా నోవాటెల్ హోటల్‌లో పవన్ ఉండిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పార్టీ నేతలతో పలు మార్లు కీలకంగా మాట్లాడిన అనంతరం ఆయన సోమవారం మధ్యాహ్నం విశాఖ నుంచి విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన ప్రయాణించే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. హోటల్ వద్ద గుమికూడిన […]