Ramesh Nalam
Author- NTV Telugu-
Virat Kohli: అభిమానులపై విరాట్ కోహ్లీ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?
Virat Kohli: మైదానంలో అగ్రెసివ్‌గా ఉండే టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అతడు ఎలాంటి భావోద్వేగాన్ని దాచుకోడు. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా దానిని బయటపెట్టేస్తుంటాడు. అందుకే విరాట్‌ను చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం నాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈనెల 23న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సమయంలో […] -
Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులు గిగ్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి
Infosys: ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటీవల మూన్ లైటింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో కూడా పనిచేస్తుండటం. మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సీరియస్ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు కావాలనుకుంటే గిగ్ […] -
Dharmana Prasad Rao: రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్
Dharmana Prasad Rao: ఏపీలో వికేంద్రీకరణ అంశంపై రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని సీఎం […] -
Ambedkar Konaseema: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఐడీ కార్డు ఉంటేనే అనుమతి
Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. అయితే పసలపూడి గ్రామానికి చేరుకోగానే అమరావతి రైతులకు నిరసన సెగ తగిలింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతుల యాత్రకు అడ్డుతగిలారు. అటు పోలీసులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డులు చూపించిన వారిని […] -
T20 World Cup: వెస్టిండీస్ జట్టుకు ఘోర అవమానం.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన కెప్టెన్
T20 World Cup: టీ20 క్రికెట్‌లో తోపుగాళ్లు ఎవరంటే ఎవరైనా వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లే చెప్తారు. పొలార్డ్, హోల్డర్, గేల్, లూయీస్, ఆండీ రసెల్, సునీల్ నరైన్, పూరన్, హిట్‌మెయిర్, బ్రావో.. ఇలా అందరూ హిట్టర్లే ఉన్న జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతుందని ఎవరైనా ఊహిస్తారా. కానీ అదే నిజమైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు ఈ ప్రపంచకప్‌లో ఘోర అవమానం ఎదురైంది. గ్రూప్ దశలోనే పసికూనలను ఎదుర్కోలేక ఇంటి […] -
Sajjala Ramakrishna Reddy: ఈ ఏడాదిలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తాం
Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు […] -
Gudivada Amarnath: అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర
Gudivada Amarnath: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని.. దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. వారిని తరిమికొట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. తక్షణమే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. […] -
NBK 107: బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్
NBK 107: అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ మూవీ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా రాత్రి 8:15 గంటలకు బాలయ్య కొత్త సినిమా టైటిల్ వెల్లడి కానుంది. అయితే చిత్ర యూనిట్ ప్రకటించకముందే ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. బాలయ్యకు సింహా అనే టైటిల్ అంటే సెంటిమెంట్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం, లక్ష్మీనరసింహా, సింహా, జై […] -
Andhra Pradesh: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. స్టైఫండ్ పెంపు
Andhra Pradesh: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44వేల నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46వేల నుంచి రూ.53 వేలకు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. వివిధ క్యాటగిరీలు, చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్‌లో పెంపుదల ఉంటుందని […] -
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు.. సోము వీర్రాజుపై కన్నా ఫైర్
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే వచ్చిందని.. పార్టీలో వ్యవహారాలన్నీ ఆయన ఒక్కడే అన్ని చూసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన […]
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!