ISRO: రికార్డు సృష్టించనున్న ఇస్రో.. ఒకేసారి 36 ఉపగ్రహాలు ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: ఈనెల 23వ తేదీ భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో రికార్డు స్థాయిలో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బ్రిటిష్ స్టార్టప్ ‘వన్ వెబ్’ సంస్థకు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధం అవుతోంది. ఏపీలోని శ్రీహరికోట షార్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రయోగం జరగనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3ని గతంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని పిలిచేవారు. 36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ భారీగా వాణిజ్య లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది.
Read Also: Special Story on RATAN TATA: రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులోనూ.. అదే ఉత్సాహం.. అదే ముందుచూపు..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
ఈ మేరకు 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ వెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. వన్ వెబ్ బ్రిటిష్ స్టార్టప్ సంస్థ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్‌టెల్ ప్రమోటర్ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్‌కు ఉన్నాయి. గతంలోనే ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేని కారణంగా అతి పెద్ద షిప్‌లలో భూకేంద్రాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. కాగా 36 ఉపగ్రహాలు ఒక్కొక్కటి 150 కిలోల బరువు కలిగి ఉండనున్నాయి.
Exciting news from India as we confirm the encapsulation of our 36 satellites ahead of #OneWebLaunch14. The satellites have now travelled to be attached to the LVM3 rocket ahead of launch later this month.
Thanks again to our team, as well as @isro, @NSIL_India and @Arianespace! pic.twitter.com/3y5xK0PokE
— Eutelsat (@EutelsatGroup) October 14, 2022
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!