Bigg Boss 6: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ చప్పగా కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో వరస్ట్ కంటెస్టెంట్లు మీరే అని మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అందరికీ అక్షింతలు వేశాడు. స్కిట్లు సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డాడు. అయితే ఈ సీజన్‌లో అంతో కొంతో హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటే అది గీతూ రాయల్ వల్లే. తొలుత ఆమె వాయిస్ విని ప్రేక్షకులకు విసుగుపుట్టినా క్రమంగా గీతూ వాయిస్, ఆమె యాస, మాటలు, చేష్టలకు అలవాటు పడిపోయారు. మనసులో ఎలాంటి దాపరికం లేకుండా గీతూ మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముక్కుసూటి తనంతో అందరినీ ఇబ్బంది పెడుతూ గీతూ ముందుకు దూసుకుపోతోంది. దీంతో ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
Read Also: IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవాలని భావిస్తున్నారా?
సాధారణంగా గీతూకు రిలేషన్ షిప్స్ అంటే నచ్చవు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు హౌస్‌లో పబ్లిక్‌గానే చెప్పింది. గత వారం కంటెస్టెంట్లు తమ ఫ్యామిలీ మెంబర్లతో మాట్లాడగా గీతూ మాత్రం తన కుక్క బొచ్చు కోసం ప్రయత్నించింది. కానీ దానికి ఎక్కువ బ్యాటరీ వాడాల్సి రావడంతో ఆమె తన తండ్రితో ఫోన్ కాల్ మాట్లాడింది. అయితే గీతూ వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఈ ప్రస్తావన కూడా హౌస్‌లో తెచ్చిన దాఖలాలు లేవు. ఆమె ప్రేమ వివాహం. గత ఏడాది ఫిబ్రవరిలో వికాస్ అనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమె భర్త వికాస్ తమిళ నేపథ్య కుటుంబానికి చెందినవాడు. అతడు ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తన భార్య గీతూ ఆట గురించి స్పందిస్తూ .. ఆమె ఆట తనకు చాగా బాగా నచ్చిందని.. చాలా బాగా అడుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోందని అభిప్రాయపడ్డాడు. గీతూ వాయిస్ పెద్దదిగా ఉండడం వల్ల రూడ్‌గా మాట్లాడినట్లు ఉంటుందని.. కానీ ఆమె మృదుస్వభావి అని వివరించాడు. వివాహం జరిగిన నాటి నుంచి గీతూను వదిలిఉండటం ఇదే మొదటి సారి అని వికాస్ పేర్కొన్నాడు.