Janasena Party: విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి ఘటన విషయంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 9 మంది జనసేన నేతలు విడుదలయ్యారు. ఈ మేరకు కేంద్ర కారాగారం వద్ద సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా తమకు బెయిల్ మంజూరు చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చి అహర్నిశలు […]
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగుతోంది. దీంతో ఈ వారం బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యాడు. ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. అంతేకాకుండా ఆహారం కూడా దూరం చేసి కొన్ని టాస్కులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కంటెస్టెంట్లకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా రేవంత్‌ను పప్పూ అని పిలుస్తూ అతడి పరువు తీశాడు. శ్రీహాన్ మాట్లాడుతుంటే.. నిలబడి ఏదో చెప్పబోయిన […]
Sunil Deodhar: ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూశామని తెలిపారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు మ్యాప్ […]
Amaravathi: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి వెస్టిండీస్ లాంటి టీమ్ ఇంటి బాట పట్టింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైంది. సూపర్-12లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 111 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఆస్ట్రేలియా పతనానికి […]
Anasuya Sister: టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లంతా సినిమా అవకాశాలతో మునిగి తేలుతున్నారు. అటు ఈ షోలో యాంకర్లు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ, రష్మీ ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అనసూయ యాంకర్‌గా రానంతవరకు యాంకర్ అంటే ఎంతో పద్ధతిగా ఉండాలనే భావన అందరిలోనూ ఉండేది. అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్ […]
Controversy: ఇటీవల కోల్‌కతాలో మహాత్మా గాంధీ పోలికలతో మహిషాసుర విగ్రహాన్ని దుర్గామండపం వద్ద ప్రతిష్ఠించి వివాదం సృష్టించిన హిందూ మహాసభ తాజాగా మరో వివాదానికి తెరతీసింది. కరెన్సీ నోట్లపై గాంధీ స్థానంలో సుభాష్ చంద్రబోస్ బొమ్మను పెట్టాలని డిమాండ్ చేసింది. దేశానికి స్వాతంత్య్ర సాధన పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన సేవలు మహాత్మాగాంధీ కంటే ఎంత మాత్రం తక్కువ కాదని హిందూ మహాసభ పేర్కొంది. కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ముద్రించడమే దేశానికి స్వాతంత్ర్యం సాధించిన […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు పోరు ఈరోజే ప్రారంభమైంది. సూపర్-12లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగులు భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 92 పరుగులతో తుదికంటా […]
Warning to Drinkers: 2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్‌లో మాత్రం తాగుబోతులు […]
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారంతో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌ల నుంచి నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ క్వాలిఫై అయ్యాయి. వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత ప్రపంచకప్‌లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్ స్థానంలో ఈ వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్, జింబాబ్వే వచ్చాయి. సూపర్-12లో […]