Lalit Modi: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో లలిత్ మోదీ బాధపడుతున్నాడు. దీంతో ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకిందని.. న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతోనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని లలిత్ మోదీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు. మూడు వారాలుగా ఇద్దరు డాక్టర్లు రోజులో 24 గంటలు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాడు. దీంతో వాళ్లకు ధన్యవాదాలు తెలియజేశాడు.
Read Also: VandeBharat: ఏపీ, తెలంగాణ మధ్య వందేభారత్ రైలు.. నేటి నుంచే బుకింగ్స్
అటు లలిత్ మోదీ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సహా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితాసేన్ బ్రదర్ రాజీవ్ సేన్ కూడా లలిత్ మోదీ కోలుకోవాలని పేర్కొన్నారు. కాగా కరోనా సోకిన వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రతికూలంగా మారడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని.. కొన్ని సందర్భాల్లో న్యుమోనియా పరిష్కారం కావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు అని.. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు కోలుకోవడానికి నెలల తరబడి నిరంతర ఆక్సిజన్ మద్దతు అవసరం కావచ్చని నోయిడా వైద్యులు వివరించారు.