Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే తొలిరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు మాత్రం తొలిరోజు బాలయ్య సినిమా కంటే తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో బాలయ్య కెరీర్‌లో మునుపెన్నడూ చూడనంత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వీరసింహారెడ్డి సినిమా సాధించింది. అయితే టాక్ మాత్రం వాల్తేరు వీరయ్యకు పాజిటివ్‌గా ఉండటం వసూళ్లు అదిరిపోతున్నాయి. అదే సమయంలో వీరసింహారెడ్డి మూవీకి రెండో రోజు నుంచి వసూళ్లలో భారీ డ్రాప్ కనిపిస్తోంది.
Read Also: Unstoppable: ‘గాడ్ ఆఫ్ మాసెస్’తో వస్తున్న ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’
ఈ నేపథ్యంలో 14వ తేదీ నుంచి వీరసింహారెడ్డికి కేటాయించిన కొన్ని స్క్రీన్‌లను థియేటర్ల యాజమాన్యాలు వాల్తేరు వీరయ్య మూవీకి కేటాయిస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణలో వాల్తేరు వీరయ్య 600, వీరసింహారెడ్డి 450, వారసుడు 385, కళ్యాణం కమనీయం 100, తెగింపు 50 స్క్రీన్‌లలో ప్రదర్శింపబడుతున్నాయి. సంక్రాంతి పండగ రోజు వాల్తేరు వీరయ్య మూవీకి మరిన్ని స్క్రీన్‌లు పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి వారసుడు మూవీకి కూడా యావరేజ్ టాక్ రావడంతో సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య అనే తెలుస్తోంది. పండగ సెలవులు ముగిసే నాటికి సంక్రాంతి విజేతపై అధికారికంగా క్లారిటీ రానుంది. సీడెడ్‌లో వీరసింహారెడ్డికి వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నా నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా కలెక్షన్‌లు తక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.