Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ అందించింది. డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ఈనెల 11న ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తున్నందున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ […]
T20 World Cup: క్రికెట్‌లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో […]
CPI Ramakrishna: ఈనెల 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతిలో బుధవారం నాడు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. ఏపీని మోదీ అన్ని విధాలుగా మోసం చేసి సిగ్గు లేకుండా వస్తున్నారని.. ఒక్క అంశంలోనైనా మోదీ ప్రభుత్వం న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 1992 వన్డే ప్రపంచకప్ జరిగినట్లే జరుగుతోంది. అప్పుడు, ఇప్పుడు మెగా టోర్నీకి వేదిక ఆస్ట్రేలియానే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దయతో సెమీస్ బెర్త్ కొట్టేసిన పాకిస్థాన్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు రెండో సెమీస్ నుంచి ఫైనల్‌కు ఎవరు వస్తారు అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్థాన్ కూడా ఫైనల్‌కు […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు […]
Demonetisation: 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికీ నోట్ల రద్దు ఎఫెక్ట్ భారత ఆర్ధిక వ్యవస్థపై కొనసాగుతుంది. నోట్ల రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూ.2వేలు నోటుతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2016 నాటి నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నాడు ఈ పిటిషన్‌లను […]
CM Jagan: ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన […]
T20 World Cup: సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఆ జట్టు బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు జోరు పెంచలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేయగా, […]
High Court: భూకబ్జా కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయగా.. తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది. సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ.. ఈ కేసు విషయంలో […]
Koti Deepotsavam 2022: అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైప భక్తి టీవీ కోటి దీపోత్సవం 9వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగనుంది. మంగళవారం నాడు కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈరోజు తొలుత డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ చేశారు. చిట్యాలకు చెందిన శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులు […]